అన్వేషించండి

Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్

Renu Desai Reaction : వీధి కుక్కలను పని కట్టుకుని చంపేస్తున్న వారిపై సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలన్నీ ప్రమాదకరం కాదని అన్నారు.

Renu Desai Fires On Killing Dogs : దేశంలో వీధి కుక్కల్ని చంపేస్తున్న వారిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ మండిపడ్డారు. ఏడాదిలో లక్షలాది మంది దోమ కాటు వల్ల చనిపోతున్నారని... ఆ ప్రాణాలకు విలువ లేదా అంటూ తాజా ప్రెస్ మీట్‌లో ప్రశ్నించారు. కుక్క కాటుతో మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు హత్యలు, రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలపై ఎందుకు రియాక్ట్ కావడం లేదని ప్రశ్నించారు.

కుక్క కరిచి చనిపోతేనే ప్రాణమా?

కుక్క కరిచి మనిషి చనిపోతేనే అది ప్రాణమా? అని ప్రశ్నించారు రేణు దేశాయ్. 'కొందరు డాగ్ హేటర్స్ కావాలనే ఇలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు. మీకు మనిషి ప్రాణం గురించి ఏమీ లేదు. కేవలం కుక్క మీద విరక్తి, కోపంతోనే మనిషి ప్రాణం తీసేస్తుందంటూ మాట్లాడుతున్నారు. సెలక్టివ్‌గానే ఎందుకు కుక్కలను టార్గెట్ చేస్తున్నారు. రోజులో ఎంతోమంది హత్యకు గురవుతున్నారు. చిన్నారులు అత్యాచారాలకు గురవుతున్నారు. అప్పుడు మీ మానవత్వం ఎక్కడికి పోయింది.

మీ ఇంటి పక్కనే చిన్నారులను లైంగికంగా వేధించే వారు చాలామంది ఉంటారు. అప్పుడు మీరేం చేస్తారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా ఎంతోమంది యువకులు, స్టూడెంట్స్ చనిపోతున్నారు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు. హెల్మెట్ వేసుకోకుండా ప్రమాదాల్లో చనిపోయిన ప్రాణాలకు విలువ లేదా? ఓ కుక్క కరిచి ప్రాణం పోతే ఆ ప్రాణానికే విలువా?' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ - స్పెషల్ సాంగ్స్‌కు కండీషన్... నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్

మగాళ్లందరినీ చంపేయాలా?

కుక్కలన్నీ ప్రమాదకరం కాదని... ఎక్కడో ఏదో ఒకటి హాని కలిగించిందని... వందల కుక్కలను చంపేస్తున్నారని మండిపడ్డారు రేణు దేశాయ్. 'మీకు నిద్ర ఎలా పడుతుంది? కచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు. కొంత మంది మగాళ్లు రేప్, మర్డర్ చేస్తారా లేదా? అలా అని అందరూ రేపిస్టులా? అందరినీ జైల్లో పెట్టాలా? అందరినీ చంపేయాలా? కొంచెమైనా బుద్ధి ఉందా? ఐదు కుక్కలు కరిస్తే మిగిలిన వంద కుక్కలను ఎందుకు చంపుతున్నారు?' అంటూ ప్రశ్నించారు.

మాకు సమాచారం ఇవ్వండి

రీసెంట్‌గా నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ వందల కుక్కలను చంపడం అమానవీయమని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'కుక్కలవి మాత్రం ప్రాణాలు కాదా? కుక్కే కాదు. ఆవు, గేదె, పిల్లి, కోతి ఇలా అన్నీ ప్రాణులే. మనుషులతో పాటు అన్నింటికీ జీవించే హక్కు ఉంటుంది. మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులే వీధి కుక్కలు పెరగడానికి కారణం. ఇందుకు కారణమైన సమస్యలపై ఎవరూ రియాక్ట్ కారు. కానీ కుక్కల గురించే మాట్లాడుతారు. ఇదెక్కడి న్యాయం. హాని కలిగించే కుక్కల గురించి నా ఎన్జీవోకు లేదా జీహెచ్ఎంసీకి సమాచారం ఇస్తే వాటిని తాము తీసుకెళ్తాం.' అని అన్నారు.

ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలం కావడం వల్లే కుక్కలు పెరిగిపోతున్నాయని రష్మీ అన్నారు. వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. విదేశీ బ్రీడ్స్ పెంచుకునే యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Chitti Chitti Cheema Song Lyrics: చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget