Rashmika Mandanna : ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ - స్పెషల్ సాంగ్స్‌కు కండీషన్... నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Rashmika Reaction : ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ తానే అని సాగుతున్న ప్రచారంపై నేషనల్ క్రష్ రష్మిక స్పందించారు. తాజా చిట్ చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Rashmika Reaction On Her Remuneration : అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అని లేకుండా గతేడాది వరుస హిట్లతో దూసుకెళ్లారు నేషనల్ క్రష్ రష్మిక. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో అలరిస్తున్నారు. గతేడాది వచ్చిన 'ది గర్ల్ ఫ్రెండ్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. తాజాగా ఆమె ఓ చిట్ చాట్‌లో స్పెషల్ సాంగ్స్, ఎక్కువ రెమ్యునరేషన్ రూమర్స్‌పై స్పందించారు.
నేనేం హీరోను కాదు
ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ తానే అని అందరూ అనుకుంటారని... కానీ అది కేవలం అపోహ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు రష్మిక. 'ఈ రూమర్ నిజం అయితే బాగుండు అని నేను వెయిట్ చేస్తున్నా. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి నేనేం హీరోను కాదు. ప్రేక్షకులకు వినోదం పంచడమే నా పని. అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అందుకే డిఫరెంట్ స్టోరీస్‌ను ఓకే చేస్తుంటా.' అని చెప్పారు.
Also Read : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
స్పెషల్ సాంగ్స్‌పై...
తాను స్పెషల్ సాంగ్స్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్మిక తెలిపారు. అయితే, ఆ చిత్రంలో తానే హీరోయిన్ అయి ఉండాలనే కండిషన్ పెట్టారు. 'ఒకవేళ నేను ఆ మూవీలో హీరోయిన్ కాకుంటే ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులు ఉన్నారు. వాళ్లు అడిగితే కచ్చితంగా లీడ్ రోల్ కాకపోయినా కూడా వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తా.' అని చెప్పారు. అయితే, ఆ డైరెక్టర్స్ ఎవరు అనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు.
నెగిటివిటీపై...
కొందరు వ్యూస్‌తో డబ్బు సంపాదించాలని కావాలనే మనపై నెగిటివిటీ సృష్టించి ఏదో ఒకటి రాస్తుంటారని అన్నారు రష్మిక. 'నెగిటివిటీ క్రియేట్ చేసే వారికి నిజంగా నాపై కోపం ఉండొచ్చు. దానికి ఇంకాస్త యాడ్ చేసి రాస్తుంటారు. అలాంటి వార్తలు ఎంతోమందిని పోషిస్తున్నాయి. వాళ్లను పోనీలే అలాగే బతకనీ అని వదిలేస్తా. ఇండస్ట్రీలో ఉన్న వారిపై నెగిటివిటీ కామన్. అందుకే అందరిపైనా వార్తలు వస్తుంటాయి. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అని అనుకున్నా... ఇప్పటివరకూ ఎవరూ మారలేదు.
ఒకప్పుడు రూమర్స్ విని చాలా బాధ పడేదాన్ని. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నా. లైఫ్‌లో జరిగిన ప్రతీ విషయం గురించి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ముందుకు సాగుతున్నా. నాకు అన్నీ రకాల చిత్రాల్లోనూ నటించాలని ఉంది. అందుకే కమర్షియల్, లవ్ స్టోరీ, స్త్రీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఇలా అన్నింటినీ అంగీకరిస్తాను.' అని చెప్పారు.






















