Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) వచ్చిన ఒక ఛాన్స్ ని కూడా వదులుకోకుండా సత్తా చాటుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026లో ( Under-19 World Cup ) కూడా ఏ మాత్రం తగ్గకుండా రికార్డుల మోత మోగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసాడు.
ఈ మ్యాచ్ లో వైభవ్, కేవలం 67 బంతుల్లో 72 పరుగులు చేసాడు. 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లను కొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ వయసులో 50+ స్కోరు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) పరుగుల రికార్డును అధిగమించాడు. విరాట్ కోహ్లీ తన యూత్ వన్డే కెరీర్‌లో 28 మ్యాచ్‌లాడి 978 పరుగులు చేయగా, వైభవ్ కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 1000 పరుగుల మైలురాయిని దాటేశాడు.
వైభవ్ కేవలం బ్యాట్ తోనే కాదు ఫీల్డింగ్‌తోనూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ఇదే మ్యాచ్ లో బౌండరీ వద్ద వైభవ్ పట్టిన క్యాచ్.. మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.




















