Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని ( Keslapur Village ) నాగోబా ఆలయంలో ( Nagoba Jatara Maha Pooja ) పుష్య అమావాస్య సందర్భంగా మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు. నాగోబా మహాపూజకు జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పిఓ యువరాజ్ మార్మాట్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్ ఇతర ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు హాజరై నాగోబాను దర్శించుకున్నారు. నాగోబా మహాపూజకు ముందు సాంప్రదాయ రీతిలో మెస్రం వంశీయులు నిర్వహించే ఈ ఆచార సాంప్రదాయ కార్యక్రమాలను మెస్రం వంశీయులు ఏ విధంగా నిర్వహిస్తారు..? పుష్య అమావాస్య సందర్భంగా మెస్రం వంశీయులు నాగోబా మహాపూజను ఏవిధంగా నిర్వహించారు. మహాపూజ అనంతరం భేటింగ్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారు. అధికారికంగా నిర్వహించే ఈ నాగోబా జాతరకు ప్రజా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఏవిధమైన ఏర్పాట్లు చేశారు...ఆ విశేషాలు అన్ని ఈ వీడియోలో చూద్దాం.





















