పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ వరుసగా హిట్స్ అందుకుంటుంది రష్మిక మందన్న.
ఈ నేషనల్ క్రష్మిక తన బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లోయింగ్ టిప్స్ కూడా ఇస్తుంది.
రష్మిక మందన్నకు కాంబినేషన్ స్కిన్ ఉందట. ఇలాంటి స్కిన్‌ని కాపాడుకోవడం ఆమె ఎలాంటి టిప్స్ ఫాలో అవుతుందో చూసేద్దాం.
మీరు ఏ స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్ వాడినా ముందు అలెర్జీ టెస్ట్ చేసుకోవాలని సూచిస్తుంది. అది మీకు పడుతుందనుకున్నప్పుడే వాడాలని చెప్తుంది.
స్కిన్ హెల్త్ విషయంలో ఫుడ్ ముఖ్యపాత్ర పోషిస్తుందట. అందుకే హెల్తీ ఫుడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్తుంది. ఆయిల్ ఫుడ్ స్కిన్ హెల్త్‌ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుందని తెలిపింది.
బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలని చెప్తుంది. అది లేకుండా బయటకు వెళ్లొద్దని చెప్తుంది.
విటమిన్ సి సీరమ్ మంచిది ఎంచుకోవాలని.. మీ డెర్మాటాలజిస్ట్ సూచించేది ఎంచుకుంటే మరిన్ని బెస్ట్ ఫలితాలు ఇస్తుందని చెప్తుంది.
స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేసేందుకు కచ్చితంగా మాయిశ్చరైజర్ ఉపయోగించాలని సూచిస్తుంది రష్మిక. ముఖాన్ని ఎక్కువసార్లు కడగొద్దని.. రోజుకు రెండుసార్లు వాష్ చేస్తే సరిపోతుందట.
పెదాలు, స్కిన్‌ని కచ్చితంగా ఎక్స్ఫోలియేట్ చేయాలని సూచిస్తుంది. దీనివల్ల డెడ్స్కిన్ సెల్స్ తొలగుతాయి. అలాగే పింపుల్స్ ఉంటే ముఖాన్ని రబ్ చేయొద్దని చెప్తుంది.