అన్వేషించండి

NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

మెడిసిన్ లో కెరీర్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం NEET UG 2026 దరఖాస్తు ఫారమ్ నింపే విధానం ఇక్కడ అందిస్తున్నాం. అప్లికేషన్ కోసం సందేహం ఉంటే ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

NEET UG 2026 Exam | వైద్య రంగంలో కెరీర్ ప్రారంభించాలని ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు NEET UG 2026 ఒక ముఖ్యమైన పరీక్ష. ఈ ఎగ్జామ్ ద్వారా MBBS, BDS, ఆయుర్వేదం, హోమియోపతి, నర్సింగ్ వంటి పలు వైద్య కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. NEET పరీక్షను ప్రతి సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుందని తెలిసిందే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తుంటారు. 

నీట్ యూజీ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది

NEET UG 2026 పరీక్ష మే 2026 మొదటి ఆదివారం నాడు నిర్వహించే అవకాశం ఉంది. అయితే, దీని అధికారిక తేదీని NTA కొన్ని రోజుల తరువాత ప్రకటిస్తుంది. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో, అంటే పెన్-పేపర్ ఆధారిత ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. నీట్ యూజీ పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

నీట్ యూజీ పరీక్ష విధానం

NEET UG 2026లో మొత్తం 180 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి 45- 45 ప్రశ్నలు, అలాగే బయాలజీ నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. అయితే ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోల్పోతారు.

NEET UG 2026 కోసం అర్హత

NEET UG 2026 రాయాలనున్న అభ్యర్థి 12వ తరగతిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. అయితే SC, ST, OBC కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. దీనితో పాటు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి వయస్సు 17 ఏళ్లు నిండి ఉండాలి, అయితే గరిష్ట వయోపరిమితి నిర్ణయించలేదు.

దరఖాస్తు ఫీజు

నీట్ యూజీ 2026 అప్లికేషన్ ఫారమ్ నింపిన తర్వాత అభ్యర్థి ఆన్‌లైన్ ద్వారా రుసుమును చెల్లించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1700, OBCతో పాటు EWS అభ్యర్థులకు రూ. 1600, SC, ST కేటగిరీలకు రూ. 1000గా నిర్ణయించారు.

అప్లికేషన్ ఫారమ్ సమర్పించే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

చివరగా సబ్మిట్ చేయడానికి ముందు, దరఖాస్తు ఫారమ్‌లో నింపిన మొత్తం వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే మీ అప్లికేషన్ ఫారం రద్దు చేయవచ్చు. ఫారమ్ సమర్పించిన తర్వాత, నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి. 

ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా NEET అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in కి వెళ్లాలి
  • హోమ్‌పేజీలో నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ (NEET UG 2026 Registration) లింక్‌పై క్లిక్ చేయండి.
  • పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ID వంటి అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి. పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోండి. 
  • మొబైల్, ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • ఇప్పుడు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
  • వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషన్ సమాచారం, పరీక్ష రాయాలనుకున్న ల్యాంగ్వేజ్, పరీక్ష సిటీని పూరించండి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ఫారమ్ సమర్పించే ముందు అన్ని వివరాలను మళ్లీ చెక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోవాలి 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget