Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
DG Ramachandra Rao: బంగారం స్మగ్లింగ్ లో దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు తండ్రి కూడా పోలీసు శాఖలో డీజీపీ, అయితే ఆయన యూనిఫాంలోనే .. ఆఫీసులోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయారు.

Ranya Rao father DGP father Ramachandra Rao: కర్ణాటక పోలీసు విభాగంలో అత్యున్నత హోదాలో ఉన్న డీజీపీ స్థాయి అధికారి డాక్టర్ రామచంద్రరావుకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏకంగా తన అధికారిక ఛాంబర్‌లోనే యూనిఫాంలో ఉండి, విధుల్లో ఉన్న సమయంలోనే మహిళలతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఈ వీడియోలలో బయటపడ్డాయి. అత్యంత క్రమశిక్షణతో ఉండాల్సిన పోలీసు కార్యాలయం ఇలాంటి రాసలీలలకు వేదిక కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలను సదరు అధికారి కార్యాలయంలోనే రహస్యంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వేర్వేరు సమయాల్లో వివిధ మహిళలతో ఆయన అత్యంత సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మహిళను కౌగిలించుకోవడం, మరొకరికి ముద్దు పెట్టడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు శాఖ పరువు బజారున పడిందనే చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್ ಅವರ ಆಪ್ತ ಡಿಜಿಪಿ ರಾಮಚಂದ್ರ ರಾವ್ ರಾಸಲೀಲೆ ಬಯಲಾಗಿದ್ದು, ರಾಜ್ಯ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯೇ ತಲೆತಗ್ಗಿಸುವಂತಾಗಿದೆ.
— Janata Dal Secular (@JanataDal_S) January 19, 2026
ಪೊಲೀಸ್ ಸಮವಸ್ತ್ರದ ಘನತೆ ಮರೆತು, ಕಚೇರಿಯಲ್ಲೇ ಮಹಿಳೆಯರೊಂದಿಗೆ ಇಂತಹ ಕೃತ್ಯ ಎಸಗಿರುವುದು ಅಕ್ಷಮ್ಯ ಅಪರಾಧ.
ಅಕ್ರಮ ಚಿನ್ನ ಕಳ್ಳಸಾಗಾಣೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ನೆರವು ನೀಡಿದ ಆರೋಪವೂ ಸಹ ಡಿಜಿಪಿ… pic.twitter.com/LiISJLokBc
ఈ రాసలీలల భాగోతం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసు శాఖలో ఇంతటి నైతిక పతనంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరారు. ప్రభుత్వంపై ఇప్పటికే విపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, ఈ వీడియోల వ్యవహారం కాంగ్రెస్ సర్కార్‌కు కొత్త తలనొప్పిగా మారింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Another Scandal rocks Karnataka.
— Deepak Bopanna (@dpkBopanna) January 19, 2026
Alleged sleaze videos of the state's Top Cop DGP Ramachandra Rao have gone viral.
IPS officer Ramachandra Rao is the step father of actress Ranya Rao who was arrested for smuggling gold into India.
Following the leak the officer has alleged… pic.twitter.com/HF3v9shrlr
అయితే, తనపై వస్తున్న ఈ ఆరోపణలను డీజీపీ రామచంద్రరావు తోసిపుచ్చారు. ఆ వీడియోలు నకిలీవని, ఎవరో కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ వీడియోలను సృష్టించారని ఆయన వాదిస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రగా ఆయన దీనిని అభివర్ణించారు. కాగా, ఈ అధికారి గతంలోనూ తన కుమార్తె నటి రన్యా రావు కి సంబంధించిన ఒక వివాదంలో సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ తాజా వివాదం ఆయనను మరింత చిక్కుల్లోకి నెట్టింది.





















