Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) తన వన్డే కెరీర్‌లో 54వ సెంచరీని చేసాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో రన్ మేషిన్ కోహ్లీ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్ టీమ్ ఇండియా గెలుపు అంచు వరకు వెళ్లి ఓటమిపాలయ్యింది. టాస్ గెలిచి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ ( Rohit Sharma ) 11, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ), కేఎల్ రాహుల్ ( KL Rahul ) సింగల్ డిజిట్ మాత్రమే చేసి అవుట్ అయ్యారు. మరో ఎండ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో టీమ్ ను ముందుకు నడిపించాడు. కోహ్లీకి తోడుగా యంగ్ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా హాఫ్ సెంచరీ చేసారు. కానీ నితిష్ రెడ్డి ( Nitish Reddy ), హర్షిత్ రాణా ( Harshit Rana ) ఔటయ్యారు.
రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) కూడా 12 పరుగులకే అవుట్ అయ్యాడు. విరాట్, సిరాజ్ వికెట్లు వరుసగా పడడంతో భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తప్పా మిగితా ఎవరు రాణించలేదు. భారతగడ్డపై న్యూజిలాండ్, టీమిండియాంపై నెగ్గిన తొలి వన్డే సిరీస్ ఇదే.





















