అన్వేషించండి

Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్

Ustaad Bhagat Singh Trailer Reaction : పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఈ నెల 19న సినిమా రిలీజ్ కానుంది.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Trailer Review : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ ఎలా ఉందంటే?

'ఇది భగత్ గీత దమ్ముంటే దాటొచ్చు' అంటూ పవన్ చెప్పిన ఒక్క డైలాగ్‌తోనే ట్రైలర్ టీజ్‌లో భారీ హైప్ క్రియేట్ చేయగా అంతకు మించిన స్థాయిలో డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ ఉన్న ట్రైలర్ కట్ అదిరిపోయింది. పవర్ స్టార్ రియల్ పవనిజాన్ని చూపించేలా యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'వాడు నీకు భయపడలేదా? అసలు ఎవడికీ భయపడలేదా?' అనే విలన్ డైలాగ్‌తో ఉస్తాద్ ఎలివేషన్ అదిరిపోగా... వయలెన్స్ మీనింగ్ సరిగ్గా చూపిస్తా అంటూ ఆయన యాక్షన్ వేరే లెవల్.

'భగత్ సింగ్... ఉస్తాద్ భగత్ సింగ్... ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం' పవన్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలుస్తోంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ... ప్రతీ పవన్ అభిమాని ఏమైతే ఎక్స్ పెక్ట్ చేశారో అంతే రేంజ్‌లో డైలాగ్స్ దగ్గర నుంచీ యాక్షన్, రియల్ పవర్ ఎలివేషన్స్ హైప్ పదింతలు పెంచేశాయి.

 

Also Read : ఓటీటీలోకి 50 కోట్ల 'తాయి కిళవి' - రాధిక డిఫరెంట్ రోల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రీ రిలీజ్ ఈవెంట్

మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక నిర్వహించనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పవన్ కల్యాణ్ సహా మూవీ టీం అంతా ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. ఫ్యాన్స్ భారీగా రానుండగా... అందుకు తగిన విధంగా ఓ పండుగలా నిర్వహించేందుకు టీం ప్లాన్ చేస్తోంది. పవర్ స్టార్ స్పీచ్‌పైనే అందరి దృష్టి ఉంది.

టికెట్ రేట్స్ హైక్

ఏపీలో ఇప్పటికే మూవీ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా బెనిఫిట్ షోలకు సైతం అనుమతి ఇచ్చింది. ఈ నెల 19న సినిమా రిలీజ్ కానుండగా... అదే రోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. ప్రీమియర్ షోస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.

అలాగే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీ ప్లెక్సుల్లో రూ.125 వరకూ పెంచుకోవచ్చు. అయితే, ఫస్ట్ 10 రోజుల వరకూ మాత్రమే ఈ రేట్స్ వర్తిస్తాయి. ఇక తెలంగాణలోనూ టికెట్ రేట్స్‌ పెంపు సహా బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు అనుమతిచ్చే ఛాన్స్ ఉంది. 

మూవీకి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా... పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో పార్తిబన్ విలన్ రోల్ చేశారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా... ఎస్ ఎస్ తమన్ బీజీఎం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో మూవీ నిర్మించారు. తాజా ట్రైలర్‌తో హైప్ పదింతలు కాగా... సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.


About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget