అన్వేషించండి

Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?

Shankar Velpari : స్టార్ డైరెక్టర్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత భారీ ప్రాజెక్ట్ 'వేల్పారి' అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒక హీరోగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

Dhanush Almost Finalized In The Lead Role For Shankar Velpari Movie : 'గేమ్ ఛేంజర్', 'భారతీయుడు 2' మూవీ డిజాస్టర్స్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ కాస్త గ్యాప్ తీసుకుని భారీ ప్రాజెక్ట్ 'వేల్పారి' కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1000 - రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

ధనుష్ ఫైనల్!

ఈ మూవీని ఎస్ యు వెంకటేశన్ రాసిన 'వీర యుగ నాయకన్ వేల్పారి' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వేల్పారి వీరత్వం, చోళ, పాండ్య రాజులతో ఆయన చేసిన పోరాటాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది. మల్టీ స్టారర్‌గా మూవీ తెరకెక్కుతుండగా... కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో పాటు మరో హీరోను కూడా శంకర్ సంప్రదించినట్లు సమాచారం. ధనుష్ దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

రెండేళ్ల డేట్స్... ధనుష్ డెసిషన్ ఏంటి?

అయితే, ఈ మూవీ కోసం ధనుష్ దాదాపు రెండేళ్లు డేట్స్ శంకర్ అడిగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ధనుష్ అంత రిస్క్ చేస్తారా? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఏప్రిల్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీని తర్వాత 'అమరన్' ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'D55' మూవీ చేస్తున్నారు. ఇందులో శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా చేయనున్నారు. అలాగే, 'లబ్బర్ పండు' మూవీ ఫేం డైరెక్టర్ తమిళరసన్ దర్శకత్వంలో 'D56' మూవీ తెరకెక్కనుంది. ఇందులో ధనుష్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికయ్యారనే ప్రచారం సాగుతోంది. మరి ఇన్ని ప్రాజెక్టుల మధ్య శంకర్ మూవీ కోసం రెండేళ్లు డేట్స్ ఇస్తారో లేదో అనేది సస్పెన్స్ నెలకొంది.

Also Read : 33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?

'ఛావా' ఫేం...

'వేల్పారి'లో మరో హీరో రోల్ కోసం బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో శంకర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ రోల్ రణవీర్ సింగ్ చేస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు విక్కీని సంప్రదిస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

అవతార్, గేమ్ ఆఫ్ త్రోన్స్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో VFX, గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు శంకర్. ప్రపంచమంతా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటుందని... అది తన కల అంటూ శంకర్ మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా చెప్పారు. ఈ మూవీని నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... ఈ ఏడాది మధ్యలో మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Plot : బేబీ Vs చెన్నై లవ్ స్టోరీ - నో కాంట్రవర్సీ ఓన్లీ క్యూట్ లవ్ స్టోరీ... ప్రొడ్యూసర్ SKN చెప్పిన కథ
బేబీ Vs చెన్నై లవ్ స్టోరీ - నో కాంట్రవర్సీ ఓన్లీ క్యూట్ లవ్ స్టోరీ... ప్రొడ్యూసర్ SKN చెప్పిన కథ
Baby Sequel : రొమాంటిక్ డ్రామా బేబీ సీక్వెల్ ఉంటుందా? - ప్రొడ్యూసర్ SKN రియాక్షన్ ఏంటంటే?
రొమాంటిక్ డ్రామా బేబీ సీక్వెల్ ఉంటుందా? - ప్రొడ్యూసర్ SKN రియాక్షన్ ఏంటంటే?
Prakash Raj : అప్పుడు అడుక్కుంటే వదిలేశాం - ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి... ప్రకాశ్ రాజ్‌పై నటుడు శివకృష్ణ ఫైర్
అప్పుడు అడుక్కుంటే వదిలేశాం - ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి... ప్రకాశ్ రాజ్‌పై నటుడు శివకృష్ణ ఫైర్
Babu Mohan : ప్రస్తుతం 15 మూవీస్ చేస్తున్నా - అలాంటి రోల్స్‌కు నో... శ్రీవారి సేవలో బాబు మోహన్
ప్రస్తుతం 15 మూవీస్ చేస్తున్నా - అలాంటి రోల్స్‌కు నో... శ్రీవారి సేవలో బాబు మోహన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget