Rajasekhar : గోటీల ఫ్యాక్టరీతో 3 కోట్ల ఆదాయం - హీరో రాజశేఖర్ ఫస్ట్ రియాక్షన్
Rajasekhar Reaction : రీసెంట్‌గా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ట్రెండ్‌పై తాజాగా హీరో రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు. ఈ వీడియోస్ చూసి చాలా నవ్వుకున్నట్లు చెప్పారు.

Rajasekhar Reaction Over Gotila Factory : 'హీరో రాజశేఖర్ బంగ్లాదేశ్, ఇండియా, పాక్‌ల్లో గోటీలు (గోళీలు) అమ్ముతూ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో జాబ్ చేసిన వారికి రూ.లక్షల్లో జీతాలు.' ఇదీ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం. ఇప్పటికే ఈ వీడియోలు, వార్తలపై రాజశేఖర్ భార్య జీవిత రియాక్ట్ అయ్యారు. అవి చూసి నవ్వుకున్నట్లు చెప్పారు. తాజాగా ఈ అంశంపై రాజశేఖరే స్వయంగా స్పందించారు.
'ఇది నిజమా? అని అడిగారు'
రీసెంట్‌గా 'ఇదేమిటమ్మా మాయ మాయ' పాట ట్రెండ్ అయ్యింది. కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' మూవీలో ఈ సాంగ్ రీమేక్ చేయగా సోషల్ మీడియాలో లక్షల కొద్దీ రీల్స్ పుట్టుకొచ్చాయి. దీంతో పాటే గోటీల ఫ్యాక్టరీ వీడియోలు కూడా ట్రెండ్ అయ్యాయి. రాజశేఖర్... గోటీల ఫ్యాక్టరీ ద్వారా రూ.కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నారంటూ ప్రచారం సాగింది. దీనిపై ఏఐ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో దీనిపై రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు.
'రీసెంట్‌గా గోటీల ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటుంటే సంతోషంగానే ఉంది. నాకు అలాంటిదేమీ లేదు. కొందరు అది నిజమేనని అనుకున్నారు కూడా. నాకు బాగా తెలిసిన వాళ్లే ఫోన్ చేసి ఇది నిజమా అని అడిగారు. ఆ వీడియో చూడగానే 'నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా అనుకున్నా.' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
ఇమిటేట్ సీన్స్‌పై...
చాలా సినిమాల్లో కొందరు నటులు తనను ఇమిటేట్ చేసే సీన్స్‌పైనా ఆయన రియాక్ట్ అయ్యారు. 'నన్ను ఎవరైనా ఇమిటేట్ చేస్తే తొలి రోజుల్లో ఇదేంటి నేను ఇలా చేశానా? అని అనిపించేది. ఆ తర్వాత వారు చేసిన ఇమిటేట్ నాకు చాలా ఫన్ అనిపించేది. డైరెక్టర్ అనిల్ రావిపూడి నన్ను, వెంకటేశ్‌ను బాగా ఇమిటేట్ చేస్తారు. రోజ్ రోజ్ రోజా పువ్వా పాటకు ఇప్పటికీ కొందరు ఇమిటేట్ చేస్తుంటారు. అప్పుడు నేను చేసిన డ్యాన్సే నాకు గుర్తు లేదు. కానీ ఇప్పుడు వాళ్లు నన్ను ఇమిటేట్ చేస్తే చూసి నవ్వుకుంటాను.' అని చెప్పారు.
ప్రస్తుతం శర్వానంద్ హీరోగా చేస్తోన్న బైకర్ మూవీలో రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శర్వా సరసన మాళివికా నాయర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఈ మూవీ కోసం తాను చాలా కష్టపడినట్లు చెప్పారు. అదంతా స్క్రీన్‌పై కనిపిస్తుందన్నారు.
ఇటీవలే రాజశేఖర్ భార్య జీవిత సైతం రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. అదంతా ఫేక్ అని ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరికీ అది ఫేక్ అని చెప్పలేమని... సోషల్ మీడియా, రీల్స్, ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు























