అన్వేషించండి

IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి

IPL 2026 Ticket Booking: IPLలో మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల కాగా, ఈ టోర్నమెంట్ మార్చి 28న ప్రారంభం కానుంది. టికెట్ బుకింగ్‌ల ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

IPL 2026 Ticket Booking Details: టీ20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ సీజన్ వచ్చేస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ షెడ్యూల్ BCCI విడుదల చేసింది. ఈ సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2026 మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (RCB vs SRH) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. షెడ్యూల్ ప్రకటించడంతో, టిక్కెట్ల విక్రయం ఎప్పుడు ప్రారంభమవుతుంది. ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ఐపీఎల్ 2026 టిక్కెట్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి?

ప్రస్తుతానికి టిక్కెట్ల విక్రయానికి సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే Zomato కు చెందిన District యాప్‌లో ఐపీఎల్ టిక్కెట్ల (IPL Tickets) కోసం ప్రత్యేక సెక్షన్ కేటాయించారు. అక్కడ ప్రస్తుతం Coming Soon అని కనిపిస్తోంది. ఇది గమనిస్తే త్వరలోనే ఐపీఎల్ 2026 టిక్కెట్ల విక్రయ సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మరోవైపు, BookMyShow ఐపీఎల్ టిక్కెట్ల కోసం ప్రీ-సేల్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. క్రికెట్ అభిమానులు ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లు, వాంఖడే స్టేడియంలో జరిగే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మ్యాచ్‌ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఐపీఎల్ 2026 టిక్కెట్ల ధరలు ఎంత ఉంటాయి

ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలు రూ. 500 నుండి ప్రారంభమై వేలల్లో ఉంటాయి. ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్‌ల టిక్కెట్లు సుమారు రూ. 2300 నుండి రూ. 2800 ధరలో ప్రారంభమవుతాయి. మిడ్-రేంజ్ సీట్లు సుమారు రూ. 3500 నుండి రూ. 7500 వరకు ఉంటాయి. ప్రీమియం సీట్లు (పవిలియన్ లేదా టెర్రస్) రూ. 8000 నుండి రూ. 15000 వరకు ఉండే అవకాశం ఉంది. ఎవరైనా లగ్జరీ సీటు కావాలనుకుంటే, టిక్కెట్ ధర రూ. 30000 పైగా ఖర్చు చేయాలి. 

ఐపీఎల్ 2026 షెడ్యూల్ రెండు భాగాలుగా ఎందుకు ?

భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ 2026 (IPL 2026)కి సంబంధించి కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రికెటర్లు, కోచ్, ఇతర సిబ్బంది ప్రయాణాలపై పడింది. ‘భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ జట్టు స్వదేశానికి తిరిగి వెళ్లడంలో సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పలు విమానాలు రద్దయ్యాయి’ అని ఐపీఎల్ సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

‘మేం ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే విషయమే. అయితే ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఏ హోటల్, ఎయిర్‌లైన్ లేదా సంబంధిత విభాగం ఇప్పటివరకు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. కానీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి నిరంతరం యుద్ధం సమాచారంపై నిఘా ఉంచాం’ అని ఆయన పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget