Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెటర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు ప్లస్ పాయింట్ అని, గిల్ కి లంక స్పిన్ పిచ్‌లపై రియల్ టెస్ట్ ఎదురుకానుందని మాజీ కెప్టెన్ హాషన్ తిలకరత్నే చెప్పాడు.

Jasprit Bumrah Absence Advantage Sri Lanka: శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఇండియాకు బిగ్ డిసాడ్వాంటేజ్ అని శ్రీలంక మాజీ కెప్టెన్ హాషన్ తిలకరత్నే అభిప్రాయపడ్డాడు. గాయం వల్ల బుమ్రా సిరీస్ నుంచి అవుట్ అవ్వగా అతడి ప్లేస్ లో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ స్క్వాడ్ లోకి వచ్చాడు. శ్రీలంక తమ పూర్తి కెపాసిటీతో ఆడితే బుమ్రా లేని టీమ్ ఇండియాని ఈజీగా దెబ్బతీయవచ్చని తిలకరత్నే పేర్కొన్నాడు. అయితే అద్భుతమైన టాలెంట్ ఉన్న ఇండియన్ టీమ్ ను తక్కువగా అంచనా వేయలేమని వివరించాడు.
Some big problem for team India.
— VIKAS (@Vikas662005) August 7, 2026
- Injury is the biggest problem for team India after IPL 2026.
- Team selection is the big reason of team India worst performance.
- Hardik, Nitish, Harshit, Bumrah, Varun, Prince, Sundar & Sai these are played only 1-2 match after IPL 26 &… pic.twitter.com/UpmSaY7X1H
బుమ్రా లేకపోవడం లంకకు గోల్డెన్ ఛాన్స్..
కొలంబోలో తిలకరత్నే మాట్లాడుతూ "వరల్డ్ క్రికెట్ లోనే బుమ్రా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. అతడు లేకపోవడం ఖచ్చితంగా శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్. అయినప్పటికీ ఇండియాలో గ్రేట్ ప్లేయర్లు ఉన్నారు కాబట్టి తేలిగ్గా తీసుకోలేం. విండీస్ పర్యటన గెలిచి మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్న శ్రీలంక తమ పొటెన్షియల్ కి తగ్గట్లు ఆడితే సిరీస్ విన్ అవ్వడం ఖాయం" అని చెప్పాడు.
Jasprit Bumrah ruled out: Bumrah has been sidelined from India two match Test series against Sri Lanka due to a knee injury.
— Inspirexo (@Inspirexo) August 7, 2026
Raju Kulkarni view: Former India pacer Raju Kulkarni says Bumrah’s bowling action is not technically sound, which he believes is why Bumrah gets… pic.twitter.com/IErluX8GaM
గిల్ బ్యాటింగ్ టెక్నిక్ సూపర్.. తిలకరత్నే ప్రశంసలు
ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ క్లాస్ ని తిలకరత్నే ప్రశంసించాడు. "గిల్ బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం. అతడి వద్ద టెక్నికల్ గా గ్రేట్ షాట్స్ ఉన్నాయి. మంచి బ్యాటింగ్ పిచ్‌లపై చాలా బ్యూటిఫుల్ గా ఆడతాడు. అయితే శ్రీలంకలోని టర్నింగ్ పిచ్‌లపై అతడికి రియల్ టెస్ట్ ఎదురుకానుంది. ఈ కండిషన్స్ లో గిల్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది" అని విశ్లేషించాడు.
వేలి గాయంతో ఫస్ట్ డే వార్మప్ మ్యాచ్ కి గిల్ దూరం
ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కానుండగా, ప్రాక్టీస్ సెషన్ లో గిల్ కుడిచేతి వేలికి గాయమైంది. ఈ గాయాన్ని బిసిసిఐ మెడికల్ టీమ్ మానిటర్ చేస్తోంది. ప్రికాషన్ లో భాగంగా శుక్రవారం ఎస్‌ఎల్‌సి ఎలెవన్ తో ప్రారంభమైన వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు గిల్ దూరమయ్యాడు. గిల్ ఆబ్సెన్స్ లో కేఎల్ రాహుల్ టీమ్ ని లీడ్ చేశాడు.
Before You Go
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
ట్రెండింగ్ వార్తలు



















