అన్వేషించండి

When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు అనేది కేవలం ఒక రోజు రెస్టు తీసుకోవడమే కాదు. అది 1700 ఏళ్ల మతపరమైన విశ్వాసాల నుంచి మొదలై, సుదీర్ఘ కార్మిక పోరాటాల ఫలితంగా లభించిన హక్కు.

When Did Sunday Holiday Start: ఆదివారం అనగానే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ముఖాల్లోనూ ఒక తెలియని ఆనందం కనిపిస్తుంది. వారం రోజుల అలసట పోగొట్టుకుని, కుటుంబంతో గడపడానికి, ఇష్టమైన పనులు చేసుకోవడానికి కేటాయించిన ఈ రోజు వెనుక చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆదివారమే ఎందుకు సెలవు రోజుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆదివారమే వీకాఫ్ ఉంటుందా? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటీ? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 

ఆదివారం సెలవు దినంగా ప్రకటించడానికి చాలా చరిత్ర ఉంది. కాన్‌స్టాంటైన్ కాలం నుంచి ఆదివారం సెలవు రోజుగా వస్తూ ఉంది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి క్రైస్తవ మతంలో ఆదివారం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఏసు పునరుత్థానం జరిగిన రోజుగా భావిస్తారు. రెండోది, నాటి రోమన్ సామ్రాజ్యంలో సూర్యారాధన ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకే సూర్యుడికి అంకితం చేసిన రోజుగా సన్‌డేను భావిస్తారు. విశ్రాంతికి అనువైనదిగా చెప్పుకుంటారు. అలా ఆదివారం సెలవు రోజుగా అధికారికంగా ప్రారంభమైంది. 

దేవుడు ఆరు రోజులు పని చేయడానికి, ఏడో రోజు విశ్రాంతి కోసం దేవుడు నిర్ణయించాడని బైబిల్‌లో చెప్పినట్టు క్రైస్తవులు వివరిస్తుంటారు. మొదట్లో యూదులు సంప్రదాయం ప్రకారం ఈ విశ్రాంతి దినం శనివారం ఉండేది. క్రమంగా ఆ సెలవు దినాన్ని ఆదివారానికి మార్చేశారు. దీన్ని పవిత్రమైన దినంగా భావించి ఈ మార్పు చేసుకున్నారు. 365 ADలో జరిగిన కౌన్సిల్‌ ఆఫ్‌ లాడిసియా లో ఈ మార్పు జరిగింది. నాల్గో శతాబ్ధం నుంచి 17వ శతాబ్ధం వరకు దాదాపు మొత్తం క్రైస్తవ ప్రపంచం ఆదివారాన్ని లార్డ్స్‌ డేగా గుర్తించేవారు.

పారిశ్రామిక విప్లవం తర్వాత మరిన్ని మార్పులు 

మతపరంగా మొదలైన ఆదివారం సెలవు రోజు 18వ శతాబ్ధంలో జరిగిన పారిశ్రామిక విప్లవం ఒక హక్కు మారింది. ఐరోపా, అమెరికాలోని పరిశ్రమల్లో కార్మికులు 12 నుంచి 18 గంటల పాటు శ్రమించేవాళ్లు. బాగా అలసిపోయే వాళ్లు. దీంతో అనారోగ్యానికి గురయ్యే వాళ్లు. అందుకే తమకు ఒక రోజు సెలవు దినం కావాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలు చేపట్టారు. 

ఇలా ఉద్యమాలు రావడంతో ఓవైపు మతపరమైన నిర్ణయాలతో ప్రార్థన చేసుకోవడానికి, శారీరక విశ్రాంతికి, కుటుంబంతో సమయం గడపడానికి ఆదివారం ఒక్కరోజున సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత 19-20 శతాబ్ధాల్లో హెన్రీ ఫోర్ట్ వంటి పారిశ్రామికవేత్తలు ఐదు రోజుల పని వారం విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది క్రమంగా శని- ఆదివారాల వీకెండ్‌ కాన్సెప్ట్‌కు దారి తీసింది. 

ప్రపంచవ్యాప్తంగా ఓ రోజు ఎక్కువ దేశాలు సెలవు దినంగా ప్రకటిస్తున్నాయి?

ప్రపంచంలోని సుమారు 70-80 శాతం దేశాల్లో ఆదివారమే ప్రధాన వీకాఫ్‌గా ఉంది. మొత్తం 195 దేశాల్లో సుమారు 160కిపైగా దేశాలు ఆదివారమే తమ వీకెండ్‌గా భాగంగా ఉంది. మరికొన్ని దేశాల్లో మాత్రం సెలవు రోజు భిన్నంగా ఉంది. 

శుక్రవారం వీకాఫ్ కలిగిన దేశాలు

ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం శుక్రవారం అత్యంత పవిత్రమైంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో శుక్రవారం సెలవు ఇస్తారు. 

శుక్రవారం- శనివారం సెలవు దినం ఉన్న దేశాలు 

గల్ఫ్‌ దేశాలైన యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బెహ్రెయిన్ వంటి చోట్ల ఈ విధానం కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని వీకెండ్‌ను శని - ఆదివారానికి మార్చుకుంది. బ్రూనై లాంటి దేశాల్లో శుక్రవారం, ఆదివారాన్ని సెలవు దినాలుగా ఇస్తారు. 

భారత్‌లో ఆదివారం సెలవు దినం ఎప్పటి నుంచి మొదలు?

భారత్‌లో ఆదివారం సెలవు విధానం బ్రిటీష్ పాలన కాలంలో ప్రవేశ పెట్టారు. బ్రిటీష్‌ వారు తమ దేశంలోని విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. ప్రభుత్వ ఆఫీస్‌లు, కోర్టులు, విద్యాసంస్థల్లో ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చిన కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో దీన్ని మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో బ్యాంకులు, ఐటీ రంగం, కార్పొరేట్‌ సంస్థల్లో శని- ఆదివారాలు సెలవుగా కొనసాగుతోంది. ఇతర రంగాల్లో ఆదివారం ప్రధాన సెలవు రోజుగా ఉంది. 

ఇప్పుడు ఆదివారమే సెలవు ఎందుకు అవసరం?

ప్రపంచ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య లావాదేవీలు సాఫీగా జరగాలంటే అందరికి ఒకే పని క్యాలెండర్‌ ఉండటం అవసరం. ఇప్పుడు ఎక్కువ మంది భార్య భర్త, కుటుంబ సభ్యుల్లో చాలా మంది పని చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు అయితే కుటుంబ సభ్యులతో గడపడానికి వీలుగుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget