అన్వేషించండి

Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు మండలి (SEIAA) సమావేశంలో ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 4,200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే గత నెలలో కాలుష్య నియంత్రణ మండలి,  నీటిపారుదల శాఖలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలను పర్యావరణ ప్రభావ మదింపు మండలికి అందజేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతులపై ఉత్తర్వులు వస్తాయని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ఊట్కూరు, మద్దూర్, కొడంగల్, కోస్గి, మక్తల్, బొంరాస్‌పేట లాంటి 10 మండలాల పరిధిలో సుమారు 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. భూసేకరణలో భాగంగా రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని అధికారులు తమ నివేదికలో సూచించారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుమారు 4,425 చెట్లను తొలగించాల్సి వస్తుందని, దానికి ప్రత్యామ్నాయంగా కాలువలు, చెరువు కట్టల వెంబడి అంతకు పదింతల మొక్కలను నాటి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

సీఎం నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగునీరు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాంతో పాటు ఉమ్మడి పాలమూరులోని పలు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. దాదాపు రూ.4,885 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 209 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భవిస్తోంది. ఇప్పటికే మొదటి దశ, రెండో దశ పంపుహౌస్‌లు, ప్రెజర్ మెయిన్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ నిర్వహించి, కాంట్రాక్ట్ సంస్థలకు పనులు కూడా అప్పగించారు. పర్యావరణ అనుమతులు మంజూరైతే ఉత్తర్వులు జారీ అయితే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. 

ప్రాజెక్టు ప్రాముఖ్యత, ప్రత్యేకత ఇదే..
ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వెనుకబడిన ప్రాంతాలకు ఈ పథకం ప్రాణవాయువు లాంటిది. భూ సేకరణో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అనేది ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఇచ్చిన అత్యుత్తమ ధరలలో ఒకటి. ఇది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేలా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో అత్యాధునిక 'ప్రెజర్ మెయిన్' పైపులైన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు, దీనివల్ల నీటి వృధా తగ్గి నేరుగా పొలాలకు నీరు చేరుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget