అన్వేషించండి

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

TGPSC FBO Notification 2026:తెలంగాణ అటవీ శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌కు‌ రంగం సిద్ధమైంది. ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఇదే ఛాన్స్‌. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ అటవీ శాఖలో 1393 బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.
  • ఇంటర్ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు, టీజీపీఎస్సీ ద్వారా నియామకం.
  • రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంపిక.
  • పర్యావరణ పరిరక్షణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యం.

TGPSC FBO Notification 2026:తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో భారీ తీపి కబురు అందించడానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ సంపదను కాపాడటంతోపాటు, పర్యావరణ సమతుల్యతను పర్యవేక్షించేందుకు అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1393 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెడీ అయ్యింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ భారీ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. పోలీస్‌ ఉద్యోగాల తరహాలోనే యూనిఫామ్‌ సర్వీస్‌పై మక్కువ చూపే అభ్యర్థులకు, ముఖ్యంగా కేవలం ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. 

తెలంగాణ ప్రభుత్వ అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా చాలా పనులు చేపడుతోంది. అయితే అడవుల సంరక్షణలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే బీట్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉంది. అటవీ ఆక్రమణలు, కలప స్మగ్లింగ్‌, వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సుదీర్ఘ క కాలం తర్వాత ఏక కాలంలో 1393 పోస్టుల భర్తీతో యువతకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

అర్హతలు- వయోపరిమితి

డిగ్రీ లేదా ఉన్నత విద్యతో సంబంధం లేకుండా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌మీడియట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా అభ్యర్థులకు కనీస వయసు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయసు 31 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్‌ వర్గాల వారికి గరిష్ట వయోపరిమితి ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అంటే వాళ్లు 36 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మాజీ సైనిక ఉద్యోగులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. 

ఎంపిక ప్రక్రియ- పరీక్ష విధానం

టీజీపీఎస్‌సీ ఈ రిక్రూట్‌మెంట్‌లను మూడు దశల్లో పూర్తి చేయనుంది. కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్‌, ఫిజికల్ స్టాండర్డ్స్‌, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ప్రాథమిక పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 ప్రశ్నలు , 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. పేపర్‌-1 కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భారత్ రాజ్యాంగం, పర్యావరణ అంశంపై ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్‌ పదో తరగతి స్థాయిలో ఉంటుంది. అర్థమేటిక్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.  

శారీరక ప్రమాణాలు- వాకింగ్ టెస్టు 

రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్టు ఉంటుంది. ఇందులో పురుషులు కనీసం 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే సరిపోతుంది. వాకింగ్ ఎండ్యూరెన్స్‌ టెస్టు ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పురుషులు 4 గంటల్లో 25 కిలోమీటర్లు, మహిళలు 4 గంటల్లో 16 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. 

నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు?

నోటిఫికేషన్‌ విడుదలకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినందున టీజీపీఎస్సీ ఏ క్షణమైనా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

తెలంగాణ అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయిన వారికి నెలకు 35వేల నుంచి 42వేల రూపాయల జీతం ఇస్తారు. ఇవి కాకుండా ప్రభుత్వ అలవెన్సులు, యూనిఫామ్‌ సర్వీస్‌ ఇస్తారు. నిరుద్యోగులు కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.   

Frequently Asked Questions

తెలంగాణలో ఎన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు?

తెలంగాణ అటవీ శాఖలో మొత్తం 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతుంది.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు కనీస విద్యార్హత ఏమిటి?

గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా ఉన్నత విద్యతో సంబంధం లేదు.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఫిజికల్ స్టాండర్డ్స్, మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జీతం ఎంత ఉంటుంది?

ఎంపికైన వారికి నెలకు 35,000 నుండి 42,000 రూపాయల జీతం లభిస్తుంది. దీనితో పాటు ప్రభుత్వ అలవెన్సులు, యూనిఫామ్ సర్వీస్ ప్రయోజనాలు ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Embed widget