అన్వేషించండి

AP Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

AP Police Jobs | ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ కలిపి మొత్తం 1,534 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 1,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
  • నవంబర్ 27 నుండి డిసెంబర్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ.
  • కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జనవరి 31, ఎస్‌ఐ ప్రిలిమ్స్ ఫిబ్రవరి 28న.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 1,534 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి (AP SLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులతో పాటు 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.  

ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 27న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (slprb.ap.gov.in) ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని నియామక మండలి సూచించింది.

ఎగ్జామ్ డేట్స్..

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా పరీక్షల తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. కానిస్టేబుల్ అభ్యర్థులకు జనవరి 31న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనుండగా, ఎస్‌ఐ అభ్యర్థులకు ఫిబ్రవరి 28న రాత పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల రోజున ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సివిల్‌ ఎస్సై, ఏఆర్‌ ఆర్‌ఎస్సై, ఎస్‌పీఎఫ్‌ ఎస్సై ఉద్యోగాలు

నవంబర్ 27న సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్‌-1 ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్‌-2 ఎగ్జామ్ నిర్వహిస్తారు

సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లు, ఫైర్‌మెన్‌లు, జైళ్ల శాఖ వార్డర్‌ ఉద్యోగాలు

నవంబర్ 27న సాయంత్రం 5 నుంచి డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 

ప్రిలిమినరీ రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.

కమ్యూనికేషన్స్‌ విభాగం ఎస్సై, పీటీవో, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల సైంటిఫిక్‌ అసిస్టెంట్‌లు, కమ్యూనికేషన్స్‌ విభాగం కానిస్టేబుళ్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు, పీటీవోలో డ్రైవర్‌ అండ్‌ మెకానిక్‌లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది.

 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు?

రాష్ట్ర పోలీసు శాఖలో మొత్తం 1,534 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) మరియు 1,156 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 27న సాయంత్రం ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

కానిస్టేబుల్ అభ్యర్థులకు జనవరి 31న ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది. ఎస్‌ఐ అభ్యర్థులకు ఫిబ్రవరి 28న రాత పరీక్షలు నిర్వహించబడతాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Embed widget