అన్వేషించండి

BHEL Jobs: ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్, సూపర్వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీ.. అప్లికేషన్ పూర్తి వివరాలు

BHEL రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద సూపర్వైజర్ ట్రెయినీ, ఇంజినీర్- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ మొత్తం 415 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేపట్టింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 415 ట్రెయినీ పోస్టులు ప్రకటించింది.
  • సూపర్వైజర్, ఇంజినీర్ ట్రెయినీ పోస్టులకు డిసెంబర్ 28 తుది గడువు.
  • పరీక్ష జనవరి 27న; సీబీటీ, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

Bhel Recruitment 2026: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద సూపర్వైజర్ ట్రెయినీ, ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 415 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ భర్తీ ప్రక్రియలో ప్రకటన 03/2026 ద్వారా సూపర్వైజర్ ట్రెయినీ 215 పోస్టులు, ప్రకటన సంఖ్య 02/2026 ద్వారా ఇంజినీర్-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ 200 పోస్టుల నియామకాలు చేపట్టి ఖాళీలు భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇదివరకే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్‌లో 28 డిసెంబర్ రాత్రి 11:45 గంటల వరకు తమ దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొంది. ఈ రెండు కేటగిరీల పోస్టులకు 27 జనవరి 2027న పరీక్ష నిర్వహించనున్నారు. 

ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే..

BHEL ఈ భర్తీ ప్రక్రియలో 2 రకాల పోస్టులకు నియామకాలు చేపట్టింది. ఇందులో సూపర్వైజర్ ట్రెయినీ 215 పోస్టుల్లో మెకానికల్ 103 పోస్టులు, ఎలక్ట్రికల్ 30 పోస్టులు, సివిల్ 26 పోస్టులు, ఫైనాన్స్ 25 పోస్టులు, హెచ్‌ఆర్ పోస్టులు 20, ఎలక్ట్రానిక్స్  పోస్టులు 11 ఉన్నాయి. అలాగే ఇంజినీర్-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ 200 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో మెకానికల్ 80 పోస్టులు, ఎలక్ట్రికల్ 30, ఎలక్ట్రానిక్స్ 25, హెచ్‌ఆర్ 20 పోస్టులు, ఫైనాన్స్ 20, సివిల్ 15, ఐటీ- కంప్యూటర్ సైన్స్ 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

BHEL ట్రెయినీ రిక్రూట్‌మెంట్‌కు విద్యార్హతలు 

సూపర్వైజర్ ట్రెయినీకి అర్హతలు

మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ పోస్టుల కోసం సంబంధిత ఇంజినీరింగ్ శాఖలో ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి. సూపర్వైజర్ ట్రెయినీకి BBA, సోషల్ వర్క్, బిజినెస్ మేనేజ్‌మెంట్, BBS లేదా BMSలో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఫైనాన్స్ పోస్టుల అభ్యర్థులు BCom రెగ్యులర్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తుదారులు కనీసం 65 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి.  

ఇంజినీర్-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీకి విద్యార్హతలు

ఇంజినీర్ పోస్టుల కోసం సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ BE - BTech డిగ్రీ, ఫైనాన్స్ అభ్యర్థులు CA లేదా CMA అర్హత, అలాగే హెచ్‌ఆర్- పర్సనల్ మేనేజ్‌మెంట్- ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వర్క్ లేదా MBAలో ఫుల్ టైమ్ PG డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 

ఈ పోస్టుల భర్తీలో అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పోస్టుల భర్తీకి ఎంపిక చేస్తారు. 

ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ careers.bhel.in కి వెళ్లండి. 
  • ఆ తరువాత కెరీర్ లేదా రిక్రూట్‌మెంట్ సెక్షన్‌కి వెళ్లాలి.
  • ఆ తర్వాత ఇంజినీర్ (Engineer)- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ లేదా సూపర్వైజర్ ట్రెయినీ భర్తీ లింక్‌పై క్లిక్ చేయండి. 
  • ఆ తరువాత అక్కడ అడిగిన సమాచారం అందించి, రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయండి. 
  • ఆ తర్వాత ఫారంలో ఎడ్యుకేషన్, వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి. 
  • అవసరమైతే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫారమ్‌కు పేమెంట్ చేయండి. 
  • చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా వివరాలు చెక్ చేసి సబ్మిట్ చేయండి.

 

Frequently Asked Questions

BHEL ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది?

BHEL సూపర్వైజర్ ట్రెయినీ మరియు ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 415 ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

BHEL రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28 రాత్రి 11:45 గంటల వరకు BHEL అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష జనవరి 27, 2027న జరుగుతుంది.

సూపర్వైజర్ ట్రెయినీ పోస్టులకు కనీస విద్యార్హతలు ఏమిటి?

మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ శాఖలో డిప్లొమా ఉండాలి. ఫైనాన్స్ కోసం BCom, HR కోసం BBA/గ్రాడ్యుయేషన్ 65% మార్కులతో అర్హులు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది?

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది, ఆపై అందులో ఉత్తీర్ణులైన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NHPC Recruitment 2026: NHPCలో 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ. 1.60 లక్షల వరకు జీతం!
NHPCలో 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ. 1.60 లక్షల వరకు జీతం!
AP Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deeksha Divas: తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Pending Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై భారీ జరిమానా కట్టాల్సిన అవసరం లేదు! లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవడం ఎలా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను లోక్ అదాలత్‌లో ఎలా సెటిల్ చేయాలి? పూర్తి వివరాలు
Embed widget