నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటే స్ట్రాప్ లెస్ బ్లౌజ్ ఎంపిక చేసుకోవడం మంచిది. జాన్వీలా ధరిస్తే లుక్ బావుంటుంది.. నెక్లెస్ లాంటిది ధరిస్తే ఇంకా బావుంటుంది.
శారీ కడితే ఓల్డ్ ఫ్యాషన్ అని ఎవరైనా అనుకునే ప్రమాదం ఉందని ఆలోచించే మోడ్రన్ అమ్మాయిల కోసం ఈ స్టైల్. బికినీ లాంటి బ్లౌజ్ ధరించి ఫ్యాషనబుల్ శారీ కడితే సూపర్బ్ ఉంటుంది. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది.
నూడుల్ స్ట్రాప్ బ్లౌజ్... మరో బోల్డ్ బ్లౌజ్ ఐడియా. గ్లామరస్ లుక్కులో కనిపించాలని ఆలోచించే అమ్మాయిల కోసం ఈ స్టైల్ ఫాలో అయితే చాలు. అందానికి అందంతో పాటు మోడ్రన్ లుక్ రెడీ.
ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు ఉండకూడదు, అలాగని శారీకి కొత్త లుక్ ఇవ్వాలని అనుకుంటే... వీ నెక్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. బుట్ట చేతులు ఇస్తే ఇంకా బావుంటుంది.
మోడ్రన్ అమ్మాయిల చాలా మంది స్లీవ్ లెస్, స్ట్రాప్ టాప్స్ ధరించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అటువంటి అమ్మాయిల కోసం ఈ డిజైన్స్. స్ట్రాప్ బ్లౌజ్ ధరిస్తే శారీకి కొత్త లుక్ వస్తుంది.
టర్టిల్ నెక్... అంటే తాబేలు మెడ తరహాలో నెక్ చుట్టూ కవర్ చేసే బ్లౌజ్ డిజైన్ ఇది. ఇందులో స్లీవ్ లెస్, ఫుల్ హ్యాండ్స్... ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు బ్లౌజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
రాయల్ లుక్ కోసం ఫుల్ హ్యాండ్స్, ఎంబ్రాయిడరీ వర్క్ చేయించిన ఇటువంటి బ్లౌజ్ డిజైన్స్ అయితే బావుంటాయి.
ఫెస్టివల్స్ లేదా ఫ్యామిలీ అకేషన్స్ కోసం హెవీ వర్క్ లేకుండా సింపుల్ లుక్ కావాలని కోరుకునే అమ్మాయిలు ఇటువంటి బ్లౌజ్ డిజైన్స్ ఎంపిక చేసుకుంటే మంచిది.
షార్ట్ హెయిర్ లేదంటే హెయిర్ ముందుకు వేసుకుని స్పెషల్ లుక్ ఇవ్వాలని అనుకుంటే బ్యాక్ లెస్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. జాన్వీ కపూర్ తరహాలో!