సిద్ధూ, అదితికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది... ఒక్కొక్కరూ ఒక్కో సినిమాకు తీసుకునేది ఎంత - తెలుసా?

Published by: Satya Pulagam

ఇద్దరి ఆస్తి కలిపితే రూ. 130 కోట్లు

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి సెప్టెంబర్ 16, 2024న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు టోటల్ రూ. 130 కోట్ల విలువ గల ఆస్తి ఉందట. 

సిద్ధార్థ్ ఒక్కడి ఆస్తి రూ. 70 కోట్లు

తమిళ, తెలుగు భాషల్లో సిద్దార్థ్ పేరున్న హీరో. ఆయనకు రూ. 70 కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయని సమాచారం.

అదితి రావు హైదరికి రూ. 60 కోట్లు

తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన అమ్మాయి అదితి రావు హైదరి. ఆమె ఆస్తి రూ. 60 - 65 కోట్ల మధ్య ఉందట. 

ఒక్కో సినిమాకు సిద్ధార్థ్ తీసుకునేది ఎంత?

హీరోగా సిద్ధార్థ్ బిజీ. ఆయన ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్.

సినిమా లేదా వెబ్ సిరీస్... అదితికి వచ్చేది ఎంత?

కథానాయికగా సినిమాలు, ప్రధాన పాత్రల్లో వెబ్ సిరీస్‌లు చేస్తూ అదితి రావు హైదరి బిజీగా ఉన్నారు. ఆమె ఒక్కో సినిమా లేదంటే వెబ్ సిరీస్‌కు కోటి నుంచి కోటిన్నర వరకూ తీసుకుంటున్నారట. 

పరిచయం ఎప్పుడు? ప్రేమ పుట్టిందెక్కడ?

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహాసముద్రం'లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. ఆ సినిమా సమయంలో జరిగిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. 

మార్చి 2024లో పెళ్లి అని ప్రచారం కానీ... 

మార్చి 2024లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారని ప్రచారం జోరుగా జరిగింది. అయితే, అప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. 

400 ఏళ్ళ చరిత్ర కల గుడిలో పెళ్లి

అదితి రావు హైదరి వనపర్తి వారసురాలు కావడంతో ఆ కుటుంబానికి చెందిన 400 ఏళ్ల చరిత్ర కల గుడిలో సిద్ధార్థ్ చేత తన మెడలో మూడు ముళ్లు వేయించుకుని, ఏడు అడుగులు నడిచారు.

నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమిటి?

'ఇండియన్ 3'తో సిద్ధార్థ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ సేతుపతితో 'గాంధీ టాక్స్' అని సైలెంట్ సినిమా చేశారు అదితి రావు హైదరి