కార్తీ లైనప్ క్రేజీగా ఉందిగా... ఈ తొమ్మిదీ మామూలు సినిమాలు కాదు

Published by: Satya Pulagam

సెప్టెంబర్ 28న 'సత్యం సుందరం'

కార్తీ, అరవింద్ స్వామి నటించిన 'సత్యం సుందరం' ఈ నెల 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలు

'కంగువ'లో అతిథిగా... మరి 'కంగువ 2'?

అన్నయ్య సూర్య కొత్త సినిమా 'కంగువ'లో కార్తీ అతిథి పాత్రలో నటించినట్లు చెన్నై సమాచారం. అంతే కాదు... 'కంగువ 2'లో ఆయన హీరో అని మరో టాక్. 

కార్తీ పోలీసుగా 'వా వాతియార్'

పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటిస్తున్న తమిళ సినిమా 'వా వాతియార్'. దీనికి నళన్‌ కుమారస్వామి దర్శకుడు. ఇది ఆ సినిమా ఫస్ట్ లుక్.

సూపర్ హిట్ 'సర్దార్' సీక్వెల్

కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ తీసిన 'సర్దార్' తెలుగులోనూ విజయం సాధించింది. ఆ సినిమా సీక్వెల్ 'సర్దార్ 2' ఇప్పుడు సెట్స్ మీద ఉంది. అందులో ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్నారు. 

తమిళ్ దర్శకత్వంలో పీరియాడిక్ ఫిల్మ్

తమిళ్ అంటే భాష కాదు... ఓ దర్శకుడి పేరు. ఆయనతో పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారు కార్తీ. హీరోగా ఆయన 29వ చిత్రమిది. ఇటీవల ప్రకటించారు.

ఆడియన్స్ మెచ్చిన 'ఖైదీ 2'

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'ఖైదీ'కి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాకు సీక్వెల్ 'ఖైదీ 2' ఎప్పుడో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావచ్చని సమాచారం. 

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో...

'కర్ణన్', 'మామన్నన్' చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్, కార్తీ కలిసి ఓ సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

'ఖాకి 2' కూడా ఉంది

కార్తీ హీరోగా హెచ్ వినోద్ తీసిన 'థీరన్ అధికారం ఒండ్రు' తెలుగులో 'ఖాకి'గా విడుదలైంది. రెండు భాషల్లో మంచి విజయం సాధించింది. ఆ సినిమా సీక్వెల్ తీయాలని నిర్ణయించారట. 

పా రంజిత్ దర్శకత్వంలో...

అణగారిన వర్గాల కథలను తెరకెక్కించే పా రంజిత్ దర్శకత్వంలో కార్తీ ఓ సినిమా చేయనున్నారని చెన్నై సమాచారం. గతంలో వీళ్లిద్దరూ 'మద్రాస్' చేశారు.