అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

Washing Machine Explodes in Hyderabad | హైదరాబాద్ లోని కృష్ణానగర్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మేషిన్ భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఇంట్లోని ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయని బాధితులు తెలిపారు.

Hyderabad News | హైదరాబాద్: నగరంలోని కృష్ణానగర్ ప్రాంతంలో శనివారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాసంలో వాషింగ్ మెషిన్ ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మేషిన్ ఆన్ చేసి ఉంచగా, అది రన్నింగ్‌లో ఉండగానే కొంత సమయానికి భారీ శబ్దంతో పేలిపోయింది.

ఈ పేలుడు ధాటికి వాషింగ్ మెషిన్ ముక్కలు ముక్కలుగా గాలిలోకి ఎగిరిపడింది. ఒక్కసారిగా సంభవించిన ఈ భారీ శబ్దానికి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగిన సమయంలో మెషిన్ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, వాషింగ్ మెషిన్ ముక్కలు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్‌ను బలంగా ఢీకొట్టడంతో అది కూడా పూర్తిగా పాడైందని.. ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Auto Drivers Strike: తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Embed widget