అన్వేషించండి

Vijayawada to Hyderabad Traffic Diversions: విజయవాడ- హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు.. ఇలా వెళ్తే ట్రాఫిక్ సమస్యకు చెక్

సంక్రాంతి పండగ జరుపుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వాహనాలకు దారి మళ్లింపులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తే ట్రాఫిక్ సమస్య ఉందని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

National Highway 65 | నల్గొండ: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం అవుతున్నారు. పండుగ పూర్తి చేసుకొని హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వస్తున్నాయి. అయితే నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ రహదారి) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 

ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీగా ప్రయాణం జరగాలన్న ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు న ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని నల్గొండ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

దారి మళ్లింపు వివరాలు
1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : 
గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా హాలియా - కొండమల్లేపల్లి - చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.

 2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
మాచర్ల నుంచి నాగార్జునసాగర్ మీదుగా పెద్దవూర - కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.

3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు : 
నల్లగొండ నుంచి మార్రిగూడ బై పాస్ మీదుగా మునుగోడు - నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65) మార్గంలో హైదరాబాద్.

4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు..
కోదాడ నుంచి హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.

5) నేషనల్ హైవే 65  (విజయవాడ -హైదరాబాద్ ) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయితే కనుక చిట్యాల నుండి భువనగిరి మీదుగా హైద్రాబాద్ మళ్లింపులు

ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (నేషనల్ హైవే 65 ) ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు..

ఈ సందర్భంగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. “సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు పయనం అవుతున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వాహనాలలో తిరిగి ప్రయాణం అవుతున్నారు. అయితే ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా  తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ కారణంగా అసౌకర్యం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు చేపట్టాం. వాహనదారులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రయాణించాలి. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటేనే ప్రయోజనం ఉంటుంది” అని తెలిపారు. సంక్రాంతి పండగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక జంక్షన్ల  వద్ద విధులు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ సరళిని ఎప్పటికప్పుడు నల్గొండ పోలీసులు పర్యవేక్షిస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనదాులు డయల్ 100 ని సంప్రదించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget