రిలయన్స్ డిజిటల్ iPhone అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద iPhone 17 Proని తగ్గింపు ధరలకు అందిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ, ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
iPhone 17 Pro Offer : దీపావళి సందర్భంగా ఆపిల్ వినియోగదారులకు ఆఫర్‌ను ప్రకటించింది. అందులో భాగంగా ఆపిల్ ఐఫోన్ 17 Pro మోడల్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

- దీపావళి ఆఫర్‌లో ఐఫోన్ 17 ప్రో రూ.55 వేలకే పొందండి.
- రిలయన్స్ డిజిటల్‌లో ఎక్స్ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్లు లభిస్తాయి.
- ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్‌పై కూడా ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి.
- నవంబర్ 10 వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభ్యం.
iPhone 17 Pro Offer : దీపావళి పండుగ సందర్భంగా కొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటే ఒక మంచి డీల్ వచ్చింది. Apple కు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ iPhone 17 Pro ను సుమారు 55 వేల రూపాయల ధరకు మీరు కొనుగోలు చేయవచ్చు. పెద్ద డిస్‌ప్లే, Pro Max మోడల్‌ను ఇష్టపడే యూజర్లకు కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తున్నారు.
తన ఆఫ్‌లైన్ స్టోర్లలో iPhone అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద iPhone 17 Pro, iPhone 17 Pro Max ధరలపై Reliance Digital భారీ రాయితీ ఇచ్చింది. ఈ ఫెస్టివల్ ఆఫర్‌లో iPhone Air కూడా అందుబాటులో ఉంది. యూజర్లకు పాత ఫోన్ ఎక్స్చేంజ్ విలువతో పాటు ఎక్స్చేంజ్ బోనస్ (Exchange Bonus), బ్యాంక్ కార్డ్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ బెనిఫిట్ కూడా మీరు పొందవచ్చు.
iPhone 17 Proపై డిస్కౌంట్ ఎంత
Reliance Digitalలో ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) 256GB వేరియంట్ లిస్టెడ్ ధర రూ. 1,22,990. దీనిపై యూజర్లకు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 3,000 బ్యాంక్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ విలువ ధర నుంచి తగ్గించారు. యాపిల్ కంపెనీ లెక్కల్లో iPhone 15 Proకి బదులుగా రూ. 55,000 ఎక్స్చేంజ్ వాల్యూ చేర్చారు. ఈ అన్ని బెనిఫిట్స్ కలిపితే మీరు iPhone 17 Pro 54,990 రూపాయల ధరకే పొందవచ్చు.
ఆఫర్ బెనిఫిల్స్ ఎప్పటివరకు పొందవచ్చు?
ఈ డీల్ దేశవ్యాప్తంగా ఉన్న Reliance Digital స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్ నవంబర్ 10వ తేదీ వరకు లేదా స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఉంటుంది. ఫోన్‌కు సరైన ఎక్స్చేంజ్ విలువ దాని మోడల్, ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ కార్డులపై లభించే డిస్కౌంట్ కూడా నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
చౌకగా iPhone 17 Pro Max
iPhone 17 Pro Max 256GB వేరియంట్‌పై ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ లిస్టెడ్ ధర 1,34,990 రూపాయలు. బ్యాంక్ డిస్కౌంట్ కింద రూ. 3,000 లబిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ. 10,000 తగ్గిస్తారు. ఆ తర్వాత రూ. 55,000 ఎక్స్చేంజ్ విలువను కలిపితే ఈ ఫోన్ ధర 66,990 రూపాయలు అవుతుంది.
12 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్
ఒకేసారి మొత్తం మొత్తం చెల్లించలేని యూజర్ల కోసం Reliance Digital 12 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ అందిస్తోంది. iPhone 17 Pro ఈఎంఐ సుమారు నెలకు రూ. 4,833 నుంచి, iPhone 17 Pro Max EMI సుమారు నెలకు రూ. 5,833 నుంచి ప్రారంభమవుతుంది.
iPhone Airపై భారీ ఎక్స్చేంజ్ బోనస్
ఈ దీపావళి ఫెస్టివ్ ఆఫర్‌లో iPhone Air కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ ఎయిర్ 256GB మోడల్ లిస్టెడ్ ధర రూ. 94,900 కాగా.. దీనిపై సైతం మీరు 22,000 రూపాయల ఎక్స్చేంజ్ బోనస్, రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతోపాటు iPhone 14కి అయితే 20,000 రూపాయల ఎక్స్చేంజ్ విలువ ప్రకారం దీని ఎఫెక్టివ్ ధర రూ. 49,990 అని పేర్కొన్నారు.
Frequently Asked Questions
దీపావళి సందర్భంగా ఐఫోన్ 17 ప్రోపై ఏ ఆఫర్ అందుబాటులో ఉంది?
iPhone 17 Pro (256GB)ని ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చు?
ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ డిస్కౌంట్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ కలిపితే iPhone 17 Pro (256GB)ని రూ. 54,990కి పొందవచ్చు. దీని లిస్టెడ్ ధర రూ. 1,22,990.
ఈ ఐఫోన్ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుంది?
ఈ ఫెస్టివల్ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో నవంబర్ 10వ తేదీ వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ ఐఫోన్ ఆఫర్‌తో EMI ఆప్షన్ ఉందా?
అవును, రిలయన్స్ డిజిటల్ 12 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ అందిస్తోంది. iPhone 17 Pro EMI నెలకు సుమారు రూ. 4,833 నుండి ప్రారంభమవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























