అన్వేషించండి

Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..

వొల్వో EX60 జనవరి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గూగుల్ జెమిని AI తో వస్తున్న తొలి ఈవీ ఇది. 810 కిమీ పరిధి, వేగవంతమైన ఛార్జింగ్ కలిగి ఉంటుంది.

వోల్వో కంపెనీ జనవరి 21, 2026న భారత మార్కెట్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఎలక్ట్రిక్ SUVని తీసుకురానుంది. వోల్వో EX60ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కారు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఎందుకంటే గూగుల్ సరికొత్త, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ జెమిని AIని కలిగి ఉన్న వోల్వో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. లగ్జరీ, సేఫ్టీ, స్మార్ట్ టెక్నాలజీని ఒకేసారి కోరుకునే వారి కోసం EX60ని ప్రత్యేకంగా రూపొందించారు. వోల్వో EX60 లాంచింగ్ తర్వాత, ఈ SUV వోల్వో ఎలక్ట్రిక్ లైనప్‌లో EX40, EX90 ఉన్నాయని కంపెనీ తెలిపింది.

కారుతో మనిషిలాంటి సంభాషణ

వోల్వో EX60 అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గూగుల్ జెమిని AI అని అందించారు. సాధారణంగా ఇతర వ్యక్తులతో ఎలా మాట్లాడతామో జెమిని ఏఐతోనూ మాట్లాడి వివరాలు రాబట్టవచ్చు. ఇది చెక్ చేసి కొన్ని వివరాలను మనకు అందించి మన పని తేలిక చేస్తుంది. ఇది ఒక తెలివైన AI అసిస్టెంట్, దీనితో డ్రైవర్ కారుతో సాధారణ భాషలో మాట్లాడవచ్చు. ఇందులో స్థిరమైన వాయిస్ కమాండ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.

మీరు ఏదైనా చిరునామాను కనుగొనాలని, రోడ్ ట్రిప్ ప్లాన్ చేయమని, సామాను బూట్‌లో వస్తుందా లేదా అని చెప్పమని లేదా కొత్త ఆలోచన గురించి ఆలోచించాలని అడగవచ్చు. ఈ మొత్తం వ్యవస్థ కారులో పూర్తిగా ఇంటిగ్రేట్ చేశారు. తద్వారా డ్రైవర్ ఫోకస్ మొత్తం రోడ్డుపైనే ఉంటుంది.  డ్రైవింగ్ మరింత సురక్షితంగా, అత్యంత సౌకర్యవంతంగానూ ఉంటుంది.

పవర్‌ఫుల్ రేంజ్, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్

వోల్వో ప్రకారం, EX60 ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 810 కిలోమీటర్ల వరకు WLTP రేంజ్ అందిస్తుంది. ఇది ఇప్పటివరకు అత్యంత ఎక్కువ కి.మీ రేంజ్ కలిగిన వోల్వో EVగా నిలిచింది. ఈ SUV ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 400 కిలోవాట్ల వరకు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల్లో దాదాపు 340 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీంతో పాటు, ఇందులో స్మార్ట్ బ్యాటరీ అల్గారిథం అందించారు. దీనిని బ్రీత్ బ్యాటరీ టెక్నాలజీస్‌తో కలిసి అభివృద్ధి చేశారు. తద్వారా బ్యాటరీ పనితీరు, బ్యాటరీ లైఫ్ టైమ్ రెండూ మెరుగ్గా ఉంటాయని పేర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
చెరుకుతో ఇథనాల్ తయారీకి కేంద్రం 'నో'.. పెట్రోల్‌ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఇథనాల్ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం బ్రేక్! పెట్రోల్ ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?
RE Bear 650 Review: ఇంటర్‌సెప్టర్ 650 ఉండగా బేర్ 650 ఎందుకు కొనాలి? మూడు నెలల వాడకంలో తెలిసిన ఆసక్తికర విషయాలివే!
Royal Enfield Bear 650.. ఒక్కసారి నడిపితే ఇక ఒదలాలనిపించని ఎడారి రేసింగ్ బైక్‌!
Honda Festive Discounts: హోండా కార్లపై బిగ్‌ డీల్స్‌.. సిటీ, ఎలివేట్, అమేజ్ కొనేవాళ్లకు రూ.2.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
హోండా కార్లపై రూ.2.35 లక్షల వరకు తగ్గింపు.. ఏ కారు కొంటే ఎక్కువ లాభమంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Embed widget