ఈ చిట్కాలతో క్షణాల్లో కార్ విండ్‌షీల్డ్ తేలికగా శుభ్రం అవుతుంది
Published by: Shankar Dukanam
Image Source: FREEPIK
January 16, 2026
చలి, వర్షంలో కార్ విండ్షీల్డ్ మీద పొగమంచు ఏర్పడి సమస్యగా మారుతుంది. దీనివల్ల విజిబిలిటీ తగ్గుతుంది.
Published by: Shankar Dukanam
Image Source: FREEPIK
January 16, 2026
పొగమంచు కనిపించగానే వెంటనే AC ఆన్ చేయాలి. ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచి, గాలి ప్రవాహాన్ని నేరుగా విండ్‌షీల్డ్ వైపునకు మళ్లించాలి
Published by: Shankar Dukanam
Image Source: FREEPIK
January 16, 2026
వెనుక కిటికీని శుభ్రంగా ఉంచుకోవడానికి, వెనుక డీఫ్రాస్టర్ను ఆన్ చేయడం మంచిది. షేవింగ్ ఫోమ్ లేదా సగం కోసిన బంగాళాదుంపను గాజుపై రుద్దడం వల్ల పొగమంచు మళ్లీ త్వరగా రాదు
Published by: Shankar Dukanam
Image Source: FREEPIK
January 16, 2026
ఏసీ రీసర్క్యులేషన్ మోడ్ ను ఆఫ్ చేయాలి. దాంతో లోపలి తేమ బయటకు పోతుంది. చలి ఎక్కువగా ఉంటే, ఫ్రంట్ డీఫ్రాస్టర్, హీటర్ ను హై లో సెట్ చేస్తే.. ఇది గాజును త్వరగా శుభ్రపరుస్తుంది.
Published by: Shankar Dukanam
Image Source: FREEPIK
January 16, 2026
కారులో సిలికా జెల్ లేదా డీహ్యూమిడిఫైయర్ ఉంచితే తేమ చాలా వరకు తగ్గుతుంది.
Published by: Shankar Dukanam
Image Source: FREEPIK
January 16, 2026
రాత్రి సమయంలో కారును పార్క్ చేసేటప్పుడు విండ్ షీల్డ్‌పై సన్ షేడ్ లేదా కార్డ్ బోర్డ్ వేయడం వల్ల ఉదయం మంచు పేరుకుపోకుండా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మైక్రోఫైబర్ గుడ్డతో అద్దాలను తుడిస్తే ఫలితం కనిపిస్తుంది.
Published by: Shankar Dukanam
Image Source: FREEPIK
January 16, 2026
గాజును శుభ్రంగా ఉంచుకోవడం, కొద్దిసేపు కిటికీలు తెరవడం వల్ల పొగమంచు త్వరగా పోతుంది. డ్రైవింగ్ సురక్షితంగా ఉంటుంది.