Tata Punch Facelift వచ్చేసింది- ధర, ఫీచర్లు చూశారా.. ఆ SUVలకు గట్టి పోటీ తప్పదు!
Tata Punch Facelift Launched: టాటా మోటార్స్ ఈరోజు భారత మార్కెట్లోకి టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ను విడుదల చేసింది. పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త ఫీచర్లు, ధర వివరాలు చూడండి.

భారతదేశంలో కాంపాక్ట్ SUV విభాగంలో విక్రయాలు పెరుగుతున్నాయి. ప్రజలు కొంచెం లగ్జరీగా ఉన్న వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేడు (జనవరి 13, 2026న) టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా విడుదల చేశారు. టాటా కంపెనీకి విజయవంతమైన SUVగా పంచ్ ఉంది. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఇది మరింత ఆకర్షణీయంగా, కొత్త ఫీచర్లతో వచ్చింది. కొన్ని రోజుల ముందు ముందే ఈ SUV గురించి మార్కెట్లో చాలా చర్చలు జరుగుతున్నాయి.
డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేశారు?
టాటా మోటార్స్ లాంచ్‌కు ముందు పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌ను ఆవిష్కరించింది. కొత్త మోడల్‌లో మునుపటి కంటే ఆధునిక రూపాన్ని ఇచ్చారు. ఇందులో కొత్త హెడ్‌లైట్‌లు, LED DRLలు, కొత్త ఫ్రంట్ బంపర్, వెనుకవైపు అప్‌డేట్ చేసిన టైల్ లైట్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేశారు. దీని కారణంగా క్యాబిన్ గతంలో కంటే ప్రీమియంగా, మరింత సౌకర్యవంతంగా కనిపిస్తుంది. మొత్తంమీద, పంచ్ ఫేస్‌లిఫ్ట్ లుక్ మరింత తాజాగా, యువతకు నచ్చేలా, ఫ్యామిలీ జర్నీ చేసేందుకు అనుకూలంగా ఉంది.
కొత్త ఫీచర్లతో మరింత స్మార్ట్‌గా SUV
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో టాటా పంచ్‌ను పలు కొత్త, మోడ్రన్ ఫీచర్లతో లాంచ్ చేశారు. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ టైల్ లైట్లు, ఆటో డిమ్మింగ్ IRVM, కార్నరింగ్ ఫంక్షన్‌తో ABS, LED ఫాగ్ లాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ అన్ని అప్‌డేట్‌లు పంచ్‌ను విభాగంలో పంచ్ ఫేస్‌లిస్ట్ స్థానాన్ని పదిలం చేయనున్నాయి.
ఇంజిన్, వేరియంట్‌లు
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండవచ్చు, ఇది దాదాపు 118 bhp శక్తిని మరియు 170 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్‌ల గురించి మాట్లాడితే, ఈ SUV ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అడ్వెంచర్+, అకంప్లిష్డ్ మరియు అకంప్లిష్డ్+ వంటి 6 వేరియంట్‌లలో రావచ్చు.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ధర, ఆ కార్లకు పోటీ
ప్రస్తుత టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.50 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ టాప్ వేరియంట్ రూ. 9.30 లక్షల వరకు ఉంటుంది. పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఉంటుంది. ఇది నేడు లాంచ్ కావడంతో భారత మార్కెట్లో ఈ విభాగంలో ఇది హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ కైగర్ తో పాటు నిస్సాన్ మాగ్నైట్ వంటి SUVలతో పోటీపడుతుంది.






















