Tata Sierra Delivery Date: సంక్రాంతికి మీ ఇంటికి కొత్త కారు- Tata Sierra డెలివరీ అప్పుడే.. అన్ని వేరియంట్ల ధరలు చూశారా
Tata Sierra Price | టాటా సియెర్రా పలు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. సియెర్రా స్మార్ట్ ప్లస్ వేరియంట్ 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. జనవరి 15న డెలివరీ మొదలుకానుంది.

Tata Sierra Features | భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా సియెర్రా (Tata Sierra) విడుదలైనప్పటి నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ కారును లాంచ్ చేసిన 24 గంటల్లోనే 70 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. జనవరి 15 నుండి టాటా సియెర్రా డెలివరీలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్‌లోని టాటా సానంద్ ప్లాంట్‌లో వేగంగా కార్ల ఉత్పత్తి జరుగుతోంది. టాటా సియెర్రా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలుగా ఉంది.
టాటా మోటార్స్, సియెర్రా అన్ని వేరియంట్‌లను ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. టాటా మోటార్స్ ఈ కొత్త కారు స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ మోడల్‌లలో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Tata Sierra వివిధ వేరియంట్‌ల ధర
టాటా సియెర్రా స్మార్ట్ ప్లస్ వేరియంట్. ఇందులో 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు బేస్ మోడల్. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలుగా తెలిపారు. అదే సమయంలో 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్‌తో లభించే బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.99 లక్షలుగా ఉంది.
టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.99 లక్షల వరకు ఉన్నాయి. టాటా సియెర్రా ప్యూర్ ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.49 లక్షలకు ప్రారంభమై రూ. 17.49 లక్షల వరకు ఉంది.
ఈ వేరియంట్‌ల ధర ఎంత?
టాటా సియెర్రా అడ్వెంచర్ మోడల్‌లో 3 వేరియంట్‌లు ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.29 లక్షల నుండి ప్రారంభమై రూ. 16.79 లక్షల వరకు ఉంది. అడ్వెంచర్ ప్లస్ 4 వేరియంట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షలకు ప్రారంభమై రూ. 18.49 లక్షల వరకు ఉన్నాయి.
టాటా సియెర్రా యొక్క అకంప్లిష్డ్ మోడల్ నాలుగు వేరియంట్‌లు, అకంప్లిష్డ్ ప్లస్ మూడు వేరియంట్‌లు మార్కెట్లోకి వచ్చాయి. టాటా సియెర్రా ఈ టాప్ మోడల్స్ ధరలు ఇంకా వెల్లడించలేదు. గతంలో విడుదల టాటా సియెర్రా విక్రయాల్లో సత్తా చాటింది. కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు టాటా సియెర్రాలో కొత్త మోడల్స్ టాటా మోటార్స్ విడుదల చేసింది. కొన్ని రోజుల కిందట బుకింగ్స్ ప్రారంభం కాగా, సంక్రాంతి సమయానికి మీ ఇంటికి కొత్త కారు వచ్చేలా కంపెనీ ప్లాన్ చేసి డెలివరీలు మొదలుపెడుతోంది.






















