Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
Border 2 Advance Booking Day 1: సన్నీ డియోల్, వరుణ్ ధావన్ నటించిన 'బోర్డర్ 2' ఈ శుక్రవారం (జనవరి 23న) విడుదల కానుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఆ రిపోర్ట్ చూడండి.

సన్నీ డియోల్ కథానాయకుడిగా నటించిన 'బోర్డర్ 2' గురించి బాలీవుడ్ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డియోల్ ఫ్యామిలీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఈ శుక్రవారం (జనవరి 23న) సినిమా విడుదల కానుంది. ఇందులో సన్నీ డియోల్ (Sunny Deol)తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి ప్రముఖులు నటించారు. మన దేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సోమవారం ప్రారంభం అయ్యింది. విదేశాల్లో ఆదివారం సాయంత్రం ప్రారంభం అయ్యింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే దూసుకు పోతోంది. ఆన్‌లైన్‌లో గంటకు 2 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడు అవుతున్నాయి. ఇటీవల విడుదలైన అనేక సినిమాలను 'బోర్డర్ 2' బీట్ చేసింది.
'ధురంధర్'ను వెనక్కి నెట్టిన 'బోర్డర్ 2'
'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్ అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడాలోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రారంభం అయ్యింది. ఈ సినిమా ఇటీవల విడుదలైన రెండు పెద్ద సినిమాలు 'ధురంధర్', 'వార్ 2' అడ్వాన్స్ బుకింగ్‌లను అధిగమించింది. ట్రేడ్ వర్గాల ప్రకారం... అమెరికా, జర్మనీలలో కూడా ఇదే స్పందన లభిస్తోంది. కెనడాలో అతి పెద్ద సినిమా చైన్ అయినటువంటి సినీప్లెక్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించలేదు. సినీప్లెక్స్‌లో బుకింగ్ ప్రారంభమైన తర్వాత మరింత స్పష్టమైన నంబర్లు తెలుస్తాయి.
Also Read: Allari Naresh: అల్లరి నరేష్ ఇంట విషాదం... ఈవీవీ తండ్రి, నరేష్ తాతయ్య మృతి
View this post on Instagram
భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన 'బోర్డర్ 2'
మన దేశంలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమై కొన్ని గంటలే అయినప్పటికీ... సినిమా జోరు బావుంది. సోమవారం మధ్యాహ్నం వరకు గంటకు 2 వేల టిక్కెట్లు అమ్ముడు అయ్యాయి. మంగళవారం కూడా ట్రెండ్ బావుంది. సినిమా విడుదల కావడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్స్‌లో సినిమా స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్స్ సాధించనుంది. ఈ సినిమా మన దేశంతో పాటు విదేశాలలో భారీ ఓపెనింగ్స్ సాధించనుంది.
ఈ సినిమా 1997లో విడుదలైన జేపీ దత్తా దేశభక్తి చిత్రం 'బోర్డర్'కి సీక్వెల్. ఆ సినిమాను అభిమానులు ఎంతో ఇష్టపడ్డారు. ఇప్పుడు 'బోర్డర్ 2'ని జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌కు 2026లో ఈ సినిమా మొదటి హిట్ అందిస్తుందని ఆశిస్తున్నారు.
Also Read: Bheems Bollywood Debut: బాలీవుడ్ వెళుతున్న భీమ్స్... అక్షయ్ కుమార్ సినిమాకు సంగీత దర్శకుడిగా






















