ఖండాల జలపాతానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TTDC) నిర్వహించిన “100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ” పోటీలో ప్రత్యేక బహుమతి (Consolation Prize) లభించింది.
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Khandala Waterfalls | ఆదిలాబాద్ జిల్లాలోని ప్రకృతి సౌందర్యానికి మరొక గుర్తింపు లభించింది. ఖండాల జలపాతానికి “100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ” పోటీలో Consolation Prize దక్కింది.

Adilabad Waterfalls: ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అటవి శాఖ రేంజ్ పరిధిలో ఉన్న ఖండాల జలపాతానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TTDC) నిర్వహించిన ప్రతిష్ఠాత్మకమైన “100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ” పోటీలో ప్రత్యేక బహుమతి (Consolation Prize) దక్కింది. తమకు ఈ బహుమతి లభించినట్లు ఇంద్రవెల్లి అటవి శాఖ రేంజ్ అధికారి సంతోష్ వెల్లడించారు. ఈ బహుమతి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విజయానికి అటవీశాఖ మార్గదర్శకత్వం ప్రధాన కారణంగా నిలిచి, ఈ మొత్తం ప్రాంతానికి గర్వకారణంగా మారింది.
అందమైన సహజ జలపాతం..
ఖండాల జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామం సమీపంలో ఉన్న ఒక అందమైన సహజ జలపాతం. సహ్యాద్రి పర్వత శ్రేణులకు చెందిన అడవులతో నిండిన కొండచరియల మధ్య ఉన్న ఈ జలపాతం, ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రకృతి ప్రేమికులు మరియు స్థానిక పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహించే నీటి ధారలతో ఈ జలపాతం మరింత మనోహరంగా కనిపిస్తుంది.

ఆదిలాబాద్ జిల్లా తన సంపన్నమైన ఆదివాసి గిరిజన వారసత్వం, విస్తారమైన సహజ పర్యాటక ప్రాంతాల కోసం విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్యావరణ పర్యాటక ప్రాంతాల శ్రేణిలో ఖండాల జలపాతం ఒక ముఖ్యమైన ఆకర్షణగా నిలిచి, ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్‌ను ప్రముఖ ప్రకృతి పర్యాటక గమ్య స్థానంగా మరింత వెలుగులోకి తీసుకువస్తోంది. ఈ గుర్తింపు వెనుక అటవీ శాఖ నిరంతర కృషి మరియు నాయకత్వం ప్రధానంగా ఉన్నాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా జిల్లా అటవీ శాఖ అధికారి (DFO) ప్రశాంత్ బాజిరావ్ పాటిల్ మార్గదర్శకత్వం, అలాగే అటవీ మండల అధికారి (FDO) చిన్న బోసారెడ్డి స్థాయి మద్దతు ద్వారా, సంరక్షణ, పర్యావరణ పర్యాటక అభివృద్ధి, స్థిరమైన అటవీ నిర్వహణలో చేసిన సేవలు ఈ ప్రాంత సహజ వారసత్వాన్ని వెలుగులోకి తీసుకురావడంలో మీడియా సహకారం వన సంరక్షణ సమితి (VSS) కీలక పాత్ర పోషించాయి.

ఎట్టకేలకు ఖండాల జలపాతానికి గుర్తింపు దక్కిందంటున్న స్థానికులు
ఖండాల జలపాతం వంటి సహజ వారసత్వానికి లభించిన ఈ గుర్తింపు, ఆదిలాబాద్ ప్రజలందరిలో అపారమైన ఆనందం, గర్వాన్ని నింపింది. ఇది భవిష్యత్తులో పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అయితే స్థానిక ప్రజలు ఎన్నో రోజులుగా ఈ ప్రాంతాల్లోని చిచ్ ధరీ, లోహరా, ఖండాల వంటి లోతైన అందమైన ప్రాంతాలను పర్యాటక శాఖ అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సులను నడపాలని రిక్వెస్ట్..
అదేవిధంగా ఉట్నూర్ నుంచి ఇంద్రవెల్లి మీదుగా చిచ్ ధరి, ఖండాల, పిప్పల్ ధరి, అంకోలి తంతోలీ, ఆదిలాబాద్ వరకు ఆర్టీసీ బస్సులు నడిపించాలని కోరారు. నిత్యం ఎంతో మంది ఇక్కడి ప్రాంత వాసులు ఇతర అవసరాల కోసం వస్తు పోతుంటారని, ఆర్టీసీ బస్సులు నడిపిస్తే ఈ ప్రాంతానికి పర్యాటక శోభ సంతరించుకొనుంది. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రకృతి పర్యాటక ప్రేమికులు వస్తూపోతూ ఉంటారు. ఇక్కడి ప్రాంత వాసులకు ఉపాధి సైతం లభిస్తుందన్నారు.
Frequently Asked Questions
ఖండాల జలపాతానికి ఏ పోటీలో బహుమతి లభించింది?
ఖండాల జలపాతం ఎక్కడ ఉంది?
ఖండాల జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామం సమీపంలో, సహ్యాద్రి పర్వత శ్రేణులకు చెందిన అడవులతో నిండిన కొండచరియల మధ్య ఉంది.
ఖండాల జలపాతం గుర్తింపులో ఎవరి పాత్ర కీలకం?
జిల్లా అటవీ శాఖ అధికారి (DFO) ప్రశాంత్ బాజిరావ్ పాటిల్ మార్గదర్శకత్వం, అటవీ మండల అధికారి (FDO) చిన్న బోసారెడ్డి మద్దతు, మీడియా సహకారం, వన సంరక్షణ సమితి (VSS) కృషి ఇందులో కీలక పాత్ర పోషించాయి.
స్థానికులు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు?
స్థానిక ప్రజలు చిచ్ ధరీ, లోహరా, ఖండాల వంటి అందమైన ప్రాంతాలను పర్యాటక శాఖ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. అలాగే, ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.






















