అన్వేషించండి

Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

Tata Punch facelift Launch date: టాటా పంచ్ కొనాలనుకుంటే, ఫీచర్లు ఎలా ఉంటాయి, ఇందులో చేసిన మార్పులు ఏంటో తెలుసుకోండి. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

భారత మార్కెట్లో టాటా మోటార్స్ తమ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch Facelift) ను జనవరి 13, 2026 విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే విడుదలకు ముందు, కంపెనీ దీని వేరియంట్‌లు, ఫీచర్ల గురించి వివరాలను వెల్లడించింది. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లతో కూడి ఉంటుంది. కారు మొత్తం 6 వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుంది. అందులో Smart, ప్యూర్ Pure, ప్యూర్ ప్లస్ Pure+, అడ్వెంచర్ Adventure, Accomplished, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ (Accomplished+S) ఉన్నాయి. ప్రతి వేరియంట్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్‌లను టాటా మోటార్స్ అందించింది. 

Tata Punch Smart లో అవసరమైన భద్రతా సౌకర్యాలు

Tata Punch Facelift లో స్మార్ట్ రకం వేరియంట్‌లో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. దీనివల్ల వాహనదారుల భద్రత చాలా మెరుగవుతుంది. దీనితోపాటు LED హెడ్‌లైట్‌లు, కొత్త స్టీరింగ్ వీల్, ఎకో, సిటీ డ్రైవ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రిమోట్ కీలెస్ ఎంట్రీతో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. వేరియంట్ బేస్ మోడల్ అయినప్పటికీ, భద్రత విషయంలో చాలా వాహనాలకు పోటీ ఇవ్వనుంది. 

Pure, Pure+ వేరియంట్‌లో మెరుగైన సౌకర్యాలు

Pure వేరియంట్‌లో వెనుక AC వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెనుక డిఫాగర్, ఆర్మ్‌రెస్ట్‌తో సెంటర్ కన్సోల్ ఇచ్చారు. అదే Pure+ వేరియంట్‌లో 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ Android Autoతో పాటు Apple CarPlay, క్రూయిజ్ కంట్రోల్ సహా USB టైప్ C ఛార్జర్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

Adventure వేరియంట్‌లో టెక్నాలజీ

ఎక్కువ టెక్నాలజీని ఇష్టపడేవారి కోసం Adventure వేరియంట్ తీసుకొచ్చింది. ఇందులో 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. Accomplished వేరియంట్‌లో 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, పెద్ద 26.03 సెం.మీ టచ్‌స్క్రీన్, LED DRLs, మెరుగైన సీట్ సౌకర్యం కల్పించారు. అదే టాప్ వేరియంట్ Accomplished+S లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో డిమ్మింగ్ IRVM, వైర్‌లెస్ ఛార్జింగ్, iRA కనెక్టెడ్ టెక్నాలజీ అందించారు.

ఇంజిన్ పనితీరు

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Punch Facelift) లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది ప్రస్తుత మోడల్‌లో కూడా ఉంది. దీనితోపాటు ఇప్పుడు టర్బో పెట్రోల్ ఇంజిన్ కొత్త ఎంపికను కూడా ఇస్తారు. దాంతో పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. కొత్త Tata Punch Facelift ఇప్పుడు ఎక్కువ భద్రతతో పాటు కొత్త ఫీచర్‌లు, మెరుగైన టెక్నాలజీతో వస్తుంది. సబ్ 4 మీటర్ SUV సెగ్మెంట్‌లో కారు గతంలో కంటే ఎక్కువ బలమైన పోటీదారుగా మారనుంది. సంక్రాంతి కానుకగా టాటా మోటార్స్ జనవరి 13న కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

Also Read: ఈ నెలలో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు - హారియర్‌, సఫారి నుంచి నెక్సాన్‌ వరకు ఆఫర్ల జాతర

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

7 సీటర్‌ హైబ్రిడ్ SUV 'MG Hector Tomahawk' లాంచ్.. పెట్రోల్‌, ఛార్జింగ్‌ కలిపి 1100km పైగా కంబైన్డ్‌ రేంజ్‌
లీటరుకు ఏకంగా 40km మైలేజ్.. 1100km పైగా కంబైన్డ్‌ రేంజ్‌తో MG కొత్త PHEV 'తోమహాక్‌' లాంచ్!
7 సీట్లు, 517 కి.మీ. రేంజ్, 204hp పవర్.. రూ.19.49 లక్షలకే MG Hector Tomahawk EVలో చాలా ప్రత్యేకతలు
MG కొత్త 7-సీటర్‌ ఎలక్ట్రిక్ SUV 'Tomahawk' లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 517 కి.మీ. రేంజ్‌!
మిత్సుబిషి 'పజెరో' ఈజ్ బ్యాక్.. సెప్టెంబర్ 2న కొత్త SUV ఆవిష్కరణ, దమ్మున్న ఆఫ్‌రోడింగ్‌ కారు!
మళ్లీ వస్తున్న మిత్సుబిషి 'పజెరో'.. ఈసారి మరింత మోడ్రన్‌, మరింత పవర్‌ఫుల్‌!
కార్లు, బైకుల హెడ్‌లైట్లకు కొత్త రూల్స్‌! హైబీమ్ వాడితే అలర్ట్.. వెలుగు తగ్గనుందా?
కార్లు, బైకుల్లో హైబీమ్‌ హెడ్‌లైట్లకు చెక్‌.. వెలుతురు విషయంలోనూ కీలక మార్పులు!

వీడియోలు

CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
Panchadarla Konda: పంచదార్ల కొండకు మైనింగ్ ముప్పు నుంచి విముక్తి! నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ఏపీ సర్కారు!
పంచదార్ల కొండకు మైనింగ్ ముప్పు నుంచి విముక్తి! నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ఏపీ సర్కారు!
Nepal Floods: నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
HPV Vaccination : HPV వ్యాక్సిన్ పెద్దయ్యాక కాదు.. చిన్న వయసులోనే వేయించాలి.. తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయాలివే
HPV వ్యాక్సిన్ పెద్దయ్యాక కాదు.. చిన్న వయసులోనే వేయించాలి.. తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయాలివే
MS Dhoni CSK Stake: సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
Dravid-Sehwag Young Cricket Legacy: టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
Embed widget