అన్వేషించండి

ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే

టయోటా జనవరి 20న మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఇది అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టయోటా కొత్త అర్బన్ క్రూయిజర్ EVని విడుదల చేసింది, ఇది వారి మొదటి మాస్-మార్కెట్ SUV.
  • ఈ SUV మారుతి సుజుకి e-విటారా ప్లాట్‌ఫామ్‌పై, కామ్రీ డిజైన్ ప్రేరణతో వస్తుంది.
  • రెండు బ్యాటరీ ఆప్షన్లు, 543 కి.మీ. వరకు రేంజ్, 174 HP వరకు శక్తి అందిస్తుంది.
  • 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

టోయోటా భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ SUV అర్బన్ క్రూయిజర్ EVని విడుదల చేసింది. ఈ కారు టయోటా మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUV. దీనితో కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి హైబ్రిడ్ కార్లపై ఎక్కువ దృష్టి పెట్టింది. కాని ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ తర్వాత మార్కెట్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ SUV నేరుగా హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric), MG ZS EVతో పాటు మారుతి సుజుకీ ఈ విటారా (Maruti Suzuki e-Vitara) లకు పోటీగా నిలుస్తుంది.

డిజైన్, ఇంటీరియర్

అర్బన్ క్రూయిజర్ EV ఫ్రంట్ డిజైన్ చాలా వరకు టయోటా కామ్రీ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో సన్నని LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. వీటితో సింగిల్ స్ట్రిప్ DRL వస్తుంది. ఈ SUV Maruti Suzuki e-Vitara కు చెందిన HEARTECT-e ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. కారులో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, బలమైన బాడీ క్లాడింగ్, ఫుల్-విడ్త్ LED టైల్‌లైట్‌లు ఉన్నాయి. కారు లోపలి భాగానికి వస్తే, ఇందులో పెద్ద 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీనితో పాటు గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ కూడా ఉన్నాయి.

బ్యాటరీ, రేంజ్, పనితీరు

Toyota Urban Cruiser EV రెండు బ్యాటరీ వేరియంట్లను కలిగి ఉంది. 49 kWh బ్యాటరీ 144 హార్స్‌పవర్ అందిస్తుంది. అయితే 61 kWh బ్యాటరీ 174 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీతో ఈ SUV ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలిపింది. ఇది లాంగ్ డ్రైవ్‌ వెళ్లేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు, టెక్నాలజీ

భద్రత విషయానికి వస్తే, ఈ SUV చాలా బలంగా ఉంది. ఇది BNCAP నుంచి 5 సార్ట్ భద్రతా రేటింగ్ పొందే అవకాశం ఉంది. కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరాతో పాటు లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు ESC, TPMS, ABSతో EBD కూడా ఉన్నాయి.

 

Frequently Asked Questions

కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ EV యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

ఈ ఎలక్ట్రిక్ SUVలో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ EV బ్యాటరీ సామర్థ్యం మరియు రేంజ్ ఎంత?

ఇందులో 49 kWh మరియు 61 kWh బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో 543 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది.

అర్బన్ క్రూయిజర్ EV యొక్క భద్రతా రేటింగ్ మరియు ఫీచర్లు ఏమిటి?

ఈ SUV BNCAP నుంచి 5 స్టార్ భద్రతా రేటింగ్ పొందే అవకాశం ఉంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఏ కార్లకు పోటీగా నిలుస్తుంది?

ఈ SUV హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, మరియు మారుతి సుజుకీ ఈ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget