Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. దాంతో ఫ్యాన్స్, సీనియర్ ప్లేయర్స్.. ఇలా అందరు కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ), టీమ్ మేనేజ్మెంట్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) కూడా టీమిండియాపై విరుచుకుపడ్డారు. ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ లేదా బౌలింగ్ కాదని.. మన ఫీల్డింగ్ అని అన్నారు.
"నేను పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు కానీ, కొంతమంది ప్లేయర్స్ చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు. దీనివల్ల బౌలర్లు తీసుకొచ్చిన ప్రెషర్ మొత్తం నీరుగారిపోయింది" అని గవాస్కర్ మండిపడ్డారు. రోహిత్ శర్మ ( Rohit Sharma ), విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉన్నప్పటికీ, మిగతా టీమ్ లో ఆ చురుకుదనం కనిపించలేదని ఆయన విమర్శించారు.
సులభంగా స్ట్రైక్ రొటేట్ చేసే అవకాశం ఇవ్వడం వల్ల బ్యాటర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే సెటిల్ అయిపోయారని అన్నారు. యంగ్ టీమ్ ఫీల్డింగ్ విభాగంలో మరింత కష్టపడాల్సి ఉందని, లేకపోతే రాబోయే సిరీస్‌లలో కూడా ఇలాంటి పరాజయాలు తప్పవని సునీల్ గవాస్కర్ హెచ్చరించారు.





















