అన్వేషించండి

Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన

Sandeepa Virk Money Laundering Case: రూ. 6 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సందీపా విర్క్ జైలుకు వెళ్లి వచ్చారు. అనంతరం తన బాధను పంచుకున్నారు. జైలు అనుభవం నరకమన్నారు. చావు కోసం ప్రార్థించినట్లు తెలిపారు.

బాలీవుడ్ నటి సందీపా విర్క్ దాదాపు 4 నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో ఆమెను అరెస్టు చేశారు. రూ. 6 కోట్ల కేసులో ఇరుక్కున్న సందీపాకు ఇటీవల బెయిల్ లభించింది. ఇప్పుడు ఆమె జైలు అనుభవాన్ని వెల్లడించారు. అంతే కాకుండా... తాను ప్రతిరోజూ ఎలా మరణం కోసం ప్రార్థించేదో కూడా చెప్పారు.

బాధను వెళ్ళగక్కిన సందీపా విర్క్
ఇటీవల సిమ్రాన్ జోత్ మక్కర్‌తో సందీపా విర్క్ మాట్లాడుతూ... జైలులో తాను గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆవిడ మాట్లాడుతూ... ''తీహార్ లాంటి ప్రదేశానికి శత్రువును కూడా పంపించకూడదు. నేను అయితే నా శత్రువులను అసలు పంపించను. తీహార్‌కు మొదటిసారి వెళ్ళినప్పుడు... దేవుడితో 'దీనికి నేను అర్హురాలిని కాదు' అన్నాను. మొదటి రోజు వాష్‌రూమ్‌కి వెళ్ళిన అనుభవాన్ని అసలు మరువలేను. సాధారణంగా ప్రజలు అంతా కర్మ ఫలం అంటారు కదా... బహుశా గత జన్మలో తెలిసో తెలియకుండానో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. అయినా సరే ఆ జైలు జీవితానికి నేను అర్హురాలిని కాదనిపించింది'' అని చెప్పారు.

దేవుణ్ని చావు కోసం ప్రార్థించాను!
జైలు జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాలను సందీపా విర్క్ ప్రస్తావించారు. అలసిపోయినప్పుడు మరణం వచ్చి తనను తీసుకు వెళ్లాలని ప్రార్థించేదాన్ని అని ఆమె చెప్పారు. ''నా కారణంగా తల్లిదండ్రులు నన్ను కలవడానికి జైలుకు రావాల్సి వచ్చినప్పుడు ఎంతో బాధ వేసేది. వారిని క్షమించమని కూడా అడిగాను. నా తల్లిదండ్రులు, తోబుట్టువులు నాకు ఎంతో అండగా నిలబడ్డారు. ఎందుకంటే... నేను ఎవరో నా వాళ్ళకు, ప్రజలకు తెలుసు'' అని సందీపా విర్క్ అన్నారు.

Also ReadVijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Simranjot Singh (@simranjotmakkar)

సందీపా విర్క్ ఇంకా మాట్లాడుతూ... ''తీహార్ జైలు లోపల 500 మందితో కలిసి జీవిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి? నా ఆరోగ్యం చాలా క్షీణించింది. ఒత్తిడి కారణంగా నేను ఎవరి సహాయం లేకుండా నిలబడలేకపోయాను. ఇప్పుడు ఆ రోజుల గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వస్తుంది'' అని అన్నారు. తీహార్ జైలు గురించి మాట్లాడుతూ... ''వాష్‌రూమ్‌ చాలా మురికిగా ఉంది. నేలపై పడుకోవాలి. బ్యారక్‌లు ఉదయం 6 గంటలకు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు మూస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. సాయంత్రం 6 గంటలకు మూస్తారు. ఫుడ్ బాగోదు... ప్రతి రోజూ అదే పప్పు, అదే కూరలు, నాలుగు రొట్టెలు, అన్నం ఇస్తారు. ఏమీ తినాలనిపించదు'' అని చెప్పారు.

Also ReadGeetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ

అసలు సందీపా విర్క్ కేసు ఏమిటి?
ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 27, 2025న సందీపా విర్క్‌కు బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే నాలుగు నెలలకు పైగా జైలులో ఉండటంతో పాటు ఆ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ గుప్తా ఇంకా పరారీలో ఉన్నందున కేసును త్వరగా ముగిసే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. ఓ కుంభకోణానికి సంబంధించిన డబ్బును తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సందీపా విర్క్. ఓ వ్యక్తికి సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తామని ప్రామిస్ చేసి దాదాపు 6 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించారట. ఈ కేసులో 2008 నుంచి 2013 మధ్య జరిగిన పాత లావాదేవీలకు సంబంధించినవని కోర్టు కూడా గుర్తించింది. సాధారణ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయబడింది.

Also ReadRenu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Rajinikanth - Shah Rukh Khan: కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
Actor Shivaji: 'దండోరా'కు ఆ కామెంట్స్ మైనస్సా.. వివాదంపై మళ్ళీ నోరు విప్పిన శివాజీ
'దండోరా'కు ఆ కామెంట్స్ మైనస్సా.. వివాదంపై మళ్ళీ నోరు విప్పిన శివాజీ
Director Sudheer Sriram: గీతా ఆర్ట్స్, సితారలో అవమానాలు.. నెరేషన్‌కు వెళితే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ - సుధీర్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
గీతా ఆర్ట్స్, సితారలో అవమానాలు.. నెరేషన్‌కు వెళితే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ - సుధీర్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget