Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Nawab Cafe OTT Platform : రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ ఎమోషనల్ డ్రామా 'నవాబ్ కేఫ్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కానుంది.

Shiva Kandukuri's Nawab Cafe OTT Release Date Locked : యంగ్ హీరో శివ కందుకూరి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా 'నవాబ్ కేఫ్'. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'నవాబ్ కేఫ్' మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్' సొంతం చేసుకోగా... మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించగా... శివ కందుకూరి సరసన తేజు అశ్విని హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పపుడిప్పు నిర్మించారు. ముందు 'ఛాయ్ వాలా'గా తెరకెక్కినా ఆ తర్వాత సెన్సార్ అభ్యంతరాలతో 'నవాబ్ కేఫ్'గా టైటిల్ మార్చారు. శివ కందుకూరి, రాజీవ్ కనకాల తండ్రీ కొడుకులుగా నటించారు.
Also Read : ఓటీటీలోకి హిట్ బొమ్మ 'విత్ లవ్' - రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
స్టోరీ ఏంటంటే?
రంగనాథ్ (రాజీవ్ కనకాల) హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నవాబ్ కేఫ్ నడుపుతుంటాడు. 400 ఏళ్ల వారసత్వ చరిత్ర కలిగిన ఆ కేఫ్‌లో ఛాయ్ తాగనిదే కొందరికి డే స్టార్ట్ కాదు. రంగనాథ్ కొడుకు రాజ్ (శివ కందుకూరి) మాత్రం తాను ఆ కేఫ్ బాధ్యతలు చూసుకోలేనని... అది అమ్మేసి అమెరికాలో సెటిల్ కావాలని కలలు కంటుంటాడు. ఇదే విషయం తండ్రికి చెప్పగా అందుకు ఆయన ఒప్పుకోడు. ఈ విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంది.
ఈ క్రమంలో తండ్రి మరణం తర్వాత రాజ్ కేఫ్ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన పెదనాన్న కొడుకు, వరుసకు అన్నయ్య అయ్యే కుమార్ (చైతన్య కృష్ణ) ఏం చేశాడు? ప్రభుత్వాధికారులు కేఫ్‌ను ఎందుకు మూసేశారు? అన్నీ అడ్డంకులు ఎదుర్కొని రాజ్ మళ్లీ కేఫ్‌ను ఎలా ఓపెన్ చేయించగలిగాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
























