Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
టాప్-5 మైలేజ్ బైక్స్: మీరు బడ్జెట్ లో సరసమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ఏ బైక్ ఉత్తమంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలను తెలుసుకుందాం.

ఎవరైనా కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేసుకుంటే ముఖ్యంగా బైక్ ధరతో పాటు మైలేజీపై ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ధర తక్కువున్నా.. మైలేజీ ఇవ్వకపోతే పెట్రోల్ నీళ్లలా తాగేస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే బైక్ ఉండాలని భావిస్తారు. భారత్‌లో అటువంటి 5 బెస్ట్ బడ్జెట్ బైక్స్, ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్‌ల గురించి ఇక్కడ అందిస్తున్నాం.
లిస్టులో ఏ బైక్‌లు ఉన్నాయి?
మొదట Honda Shine విషయానికి వస్తే.. ఈ బైక్‌లో 123.94cc ఇంజన్ ఉంటుంది. ఇది 10.63 hp పవర్, 11 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 10.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు 81,675 రూపాయల నుండి ప్రారంభమై 85,148 రూపాయల వరకు ఉంటుంది. ఈ బైక్ లీటరుకు దాదాపు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
రెండవ బైక్ Hero Xtreme 125R. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు 90,800 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర రూ.1,08,174 వరకు ఉంటుంది. ఇందులో 125cc ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇంజిన్ 11.4 bhp పవర్, 10.5 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ లీటరుకు సుమారు 66 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ లభిస్తుంది.
మూడవ స్థానంలో Hero HF Deluxe ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మైలేజ్ బైక్‌లలో ఒకటి. ఇందులో 97.2cc ఇంజన్ ఉంది. ఇది 8.02 PS పవర్, 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ లీటరుకు సుమారు 65 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు 61,589 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర రూ. 76,260 అవుతుంది.
తర్వాతి బైక్ Hero Splendor Plus XTEC. ఇది చాలా ఏళ్లుగా భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటిగా ఉంది. స్ట్రాంగ్ బాడీ, తక్కువ మెయింటెనెన్స్, అద్భుతమైన మైలేజీ దీని ప్రత్యేకతలు. ఈ బైక్ లీటరుకు సుమారు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఇందులో i3S టెక్నాలజీ ఉంటుంది. ఇది ట్రాఫిక్‌లో పెట్రోల్‌ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. హైదరాబాద్‌లో దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 78,426 కు ప్రారంభం కాగా, ఆన్ రోడ్ ధర రూ. 95,440 అవుతుంది.
చివరగా Honda SP 125 విషయానికి వస్తే.. ఇందులో 123.94cc ఇంజన్ అమర్చారు. ఇది 10.87 PS పవర్, 10.9 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 11.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. ఈ బైక్ లీటరుకు సుమారు 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ ధర సుమారు 87,881 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఆర్టీవో ఛార్జీలు, ఇన్సురెన్స్ కలిపితే ఆన్ రోడ్ ధర రూ. 1,09,092 (ఒక లక్షా 9 వేల రూపాయలు) అవుతుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్ కొనాలనుకుంటే, ఈ ఆప్షన్లన్నీ మీకు బెస్త్ అని చెప్పవచ్చు. అయితే బైక్ కొనేముందు ఫీచర్లు పూర్తిగా తెలుసుకుని, మైలేజీ వివరాలు, ఈఎంఐ ఎంత పడుతుందో పక్కాగా తెలుసుకున్నాకే కొనడం మంచిది.
























