Vishnu Vinyasam Box Office Collection : శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Vishnu Vinyasam Day 2 Collection : యంగ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం' రెండు రోజుల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Sree Vishnu's Vishnu Vinyasam Two Days Box Office Collection Worlwide : టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మిక్స్ డ్ టాక్ వచ్చినా రెండు రోజుల్లోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. వరల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ మరింత పెరిగాయి.
రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మూవీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.9.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ మేరకు హీరో శ్రీవిష్ణు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతటి సక్సెస్ అందించినందుకు ఆడియన్స్‌కు థాంక్స్ చెప్పారు. ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.2 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుండగా... రెండో రోజుల్లో డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరగొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
View this post on Instagram
Also Read : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఈ మూవీకి యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించగా... శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. అలాగే, సత్య, బ్రహ్మాజీ, మురళీ శర్మ, ప్రవీణ్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాధన్ మ్యూజిక్ అందించారు. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో శ్రీవిష్ణు నవ్వులు పూయించారు.
స్టోరీ ఏంటంటే?
ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా వర్క్ చేస్తుంటాడు విష్ణు (శ్రీవిష్ణు). చిన్నప్పటి నుంచీ జాతకాల పిచ్చితో ఏ పని చేసినా వాస్తు, న్యూమరాలజినీ ఫాలో అవుతుంటాడు. దీంతో 30 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాకుండా సింగిల్‌గానే మిగిలిపోతాడు. అదే కాలేజీలో మనీషా (నయన సారిక) అనే లెక్చరర్ కింద ఏడాది పాటు పని చేయాల్సి వస్తుంది. తొలి చూపులోనే విష్ణును చూసి ఇష్టపడుతుంది మనీషా. అయితే, ఆమెకు కూడా ఓ చిత్రమైన సమస్య ఉంటుంది. దీంతో ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా పెళ్లి కాదు.
మనీషా పద్ధతి చూసి తొలుత సందేహించినా ఆ తర్వాత జాతకాలు కలవడంతో ఆమె ప్రేమకు ఓకే చెప్తాడు శ్రీవిష్ణు. సరిగ్గా పెళ్లి చేసుకుందామనుకునే టైంలోనే మనీషా తన సమస్యను బయట పెడుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు విష్ణు. అసలు ఆమెకు ఉన్న సమస్య ఏంటి? విష్ణు ఆ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? జాతకాల పిచ్చి ఉన్న విష్ణు చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
























