Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై ( Rohit Sharma ) తీవ్ర విమర్శలు వస్తున్నాయి. న్యూజీలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో హిట్ మ్యాన్ రాణిస్తాడని అందరు అనుకున్నారు. కానీ ఆలా జరగలేదు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ కేవలం 61 పరుగులు మాత్రమే చేసాడు.
మూడో వన్డేలో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో ఫ్యాన్స్ చాలా డిస్సపాయింట్ అయ్యారు.
రోహిత్ ఆటతీరుపై న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ( Simon Doule ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. “రోహిత్‌కు ఎప్పుడూ ఒక టార్గెట్ ఉంటుంది.. టీ20 వరల్డ్ కప్ లేదా 50 ఓవర్ల వరల్డ్ కప్ వంటి గోల్ ఉంటేనే తను ఆడతాడు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా టైం ఉంది. అంతవరకు ఆడే కసి రోహిత్‌లో ఉందా? అని నాకు అనుమానంగా ఉంది” అని అన్నారు డౌల్.
ఇప్పటికే రెండు ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించి రోహిత్, కేవలం వన్డే సిరీస్ లో మాత్రమే ఆడుతున్నాడు. దాంతో కావాల్సినంత ప్రాక్టీస్ హిట్ మ్యాన్ కు లభించడం లేదని.. అది తన ఫామ్‌పై ప్రభావం చూపుతోందని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు.





















