అన్వేషించండి

Hero Destini 110 డైలీ యూజ్‌కు బాగానే ఉంటుందా? నిజ జీవిత మైలేజ్‌ వివరాలు ఇవే

Hero Destini 110 స్కూటర్‌ సిటీలో 54.10 kmpl, హైవేపై 64.10 kmpl మైలేజ్‌ ఇచ్చింది. నిజ జీవిత టెస్ట్‌లో వచ్చిన ఫలితాలు, పూర్తి విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి.

Hero Destini 110 Mileage: డైలీ ఆఫీస్‌కి వెళ్లే వాళ్లు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్‌ కొనాలని చూసే వాళ్లు ఎక్కువగా అడిగే ప్రశ్న ఒక్కటే - “మైలేజ్‌ ఎంత ఇస్తుంది?”. అందుకే, ఆటో ఎక్స్‌పర్ట్‌లు హీరో డెస్టిని 110 స్కూటర్‌ను సిటీ రోడ్లపై, హైవేపై పరీక్షించి నిజ జీవిత మైలేజ్‌ ఎంత వచ్చిందో తెలుసుకున్నారు.

హీరో డెస్టిని 110లో 110.9cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 7,250rpm వద్ద 8.1hp శక్తి, 5,750rpm వద్ద 8.7Nm టార్క్‌ అందిస్తుంది. ఇందులో హీరో ప్రత్యేకమైన i3S టెక్నాలజీ ఉంటుంది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కొద్ది సెకన్లు ఆగితే ఇంజిన్‌ ఆగిపోతుంది. యాక్సిలరేటర్‌ తిప్పగానే మళ్లీ స్టార్ట్‌ అవుతుంది. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుంది.

సిటీలో మైలేజ్‌ ఎంత వచ్చింది?

ఆటో ఎక్స్‌పర్ట్‌లు హీరో డెస్టిని 110ని సిటీలో 46.1 కిలోమీటర్లు నడిపారు. ట్రాఫిక్‌ ఉన్న రోడ్లపై స్థిరమైన వేగంతో, అవవసరంగా హార్డ్‌ యాక్సిలరేషన్‌ చేయకుండా రైడ్‌ చేశారు. టెస్ట్‌ పూర్తయ్యాక ట్యాంక్‌ను మళ్లీ ఫుల్‌ చేసేందుకు 0.80 లీటర్ల పెట్రోల్‌ అవసరమైంది. దీని అర్ధం -  హీరో డెస్టిని 110 సిటీలో లీటరుకు 54.10 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చింది. రోజూ ఆఫీస్‌కి, మార్కెట్‌కి వెళ్లే వారికి ఇది మంచి నంబర్‌గా చెప్పొచ్చు.

హైవే మీద మైలేజ్‌ ఎంత?

ఆటో ఎక్స్‌పర్ట్‌లు హీరో డెస్టిని 110ని హైవే మీద 51.3 కిలోమీటర్లు నడిపారు. ఎక్కువ సమయం 65 నుంచి 70 కిలోమీటర్ల వేగం మధ్య కొనసాగించారు. టెస్ట్‌ అనంతరం మళ్లీ ట్యాంక్‌ ఫుల్‌ చేసేందుకు 0.80 లీటర్ల పెట్రోల్‌ అవసరమైంది. దీని అర్ధం - హీరో డెస్టిని 110 హైవే మీద లీటరుకు 64.10 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చింది. రోజూ కాస్త దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లకు ఇది చాలా మంచి విషయం.

సగటు మైలేజ్‌

సిటీ, హైవే ఫలితాలను కలిపి చూస్తే సగటున లీటరుకు 59.15 కిలోమీటర్లు వచ్చింది. 110సీసీ స్కూటర్‌ సెగ్మెంట్‌లో ఇది మంచి ఫలితంగా చెప్పవచ్చు.

మైలేజ్‌విశ్లేషణ

హీరో డెస్టిని 110ని ప్రధానంగా కుటుంబ వినియోగానికి అనుకూలంగా రూపొందించారు. పనితీరు పరంగా మితమైన శక్తి ఇస్తుంది. వేగంగా వెళ్లాలనుకునే వారికి కాకుండా, స్థిరంగా ప్రయాణించే వారికి ఇది బాగా సరిపోతుంది.

సిటీ రైడ్‌లో ఎక్స్‌పర్ట్‌లు స్థిరమైన వేగాన్ని కొనసాగించారు. హైవేపై కూడా అధిక వేగం కాకుండా 65-70 కిమీ వేగం మధ్య నడిపారు.

ఈ స్కూటర్‌లో లైవ్‌ యావరేజ్‌ మైలేజ్‌ ఇండికేటర్‌ కూడా ఉంటుంది. రైడర్‌ వెంటనే తన రైడింగ్‌ స్టైల్‌ను మార్చుకుని మెరుగైన మైలేజ్‌ సాధించవచ్చు.

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి - మైలేజ్‌ రైడింగ్‌ స్టైల్‌, ట్రాఫిక్‌, రోడ్‌ పరిస్థితులపై ఆధారపడి మారుతుంది.

మైలేజ్‌ టెస్ట్‌ ఎలా చేశారు?

ముందుగా ట్యాంక్‌ను పూర్తిగా నింపారు. కంపెనీ సూచించిన టైర్‌ ప్రెషర్‌ ఉంచారు. ఒకే రూట్‌లో సిటీ, హైవే ప్రయాణాలు చేశారు. రెండు టెస్టుల్లో రైడర్‌ బరువు, లోడ్‌ ఒకేలా ఉండేలా చూశారు. టెస్ట్‌ పూర్తయ్యాక మళ్లీ ట్యాంక్‌ ఫుల్‌ చేసి ఎంత పెట్రోల్‌ ఖర్చయిందో ట్రిప్‌ మీటర్‌తో పోల్చి ఖచ్చితమైన ఫలితం తీసుకున్నారు.

మీరు రోజూ 20-30 కిలోమీటర్లు ప్రయాణించే కుటుంబ వినియోగదారుడైతే హీరో డెస్టిని 110 మంచి మైలేజ్‌, సౌకర్యం ఇస్తుంది.

సిటీ యూజ్‌ ఎక్కువగా ఉంటే 54 kmpl దగ్గర, హైవే యూజ్‌ ఉంటే 64 kmpl వరకు ఇవ్వగలదని ఈ పరీక్షలు చెబుతున్నాయి.

ధర

తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 93,018 నుంచి 83,050 వరకు ఉంటుంది. అన్ని ఖర్చులు కలుపుకుని ఆన్-రోడ్‌ ధర దాదాపు రూ. 93,018 నుంచి 1,00,707 వరకు ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget