PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
PF Withdrawal Latest News: యూపీఐ ద్వారా ఈపీఎఫ్ఓ పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలో కల్పించనున్నారు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో ఆప్షన్లు తీసుకువస్తున్నారు.

PF Withdrawal By UPI: మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీకు ప్రతినెలా మీ శాలరీ నుంచి PF కట్ అవుతుందా? అయితే, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. అందరు PF ఖాతాదారులు అవసరమైనప్పుడు తమ PF నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు PF డబ్బును విత్‌డ్రా చేయడం త్వరలోనే తేలిక కానుంది. ఇందుకోసం UPI ద్వారా మనీ విత్‌డ్రా చేసుకోవడంతో పాటు, ఎవరికైనా డబ్బు పంపడం సైతం అంతే సులభం కానుంది.
EPFO త్వరలో ఒక కొత్త వ్యవస్థను తీసుకురాబోతోంది. దీని ద్వారా ఉద్యోగులు నేరుగా UPI యాప్స్ ద్వారా తమ PF ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ సౌకర్యం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే అత్యవసర సమయాల్లో కోట్లాది మంది ఉద్యోగులకు తక్షణ నిధులు పొందడాన్ని సులభతరం చేస్తుంది. PF సిస్టమ్ పూర్తిగా డిజిటల్ మోడ్‌లోకి ఒక కొత్త అడుగు వేస్తుంది.
UPI ద్వారా PF డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి?
EPFO ద్వారా ప్రారంభించనున్న ఈ కొత్త విధానంలో PFని విత్‌డ్రా చేయడం దాదాపు మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగా ఉంటుంది. ఖాతాదారులు లాగిన్ అయి వారి పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో, అందులో ఎంత డబ్బును విత్‌డ్రా చేయవచ్చో చూడవచ్చు. తరువాత వారు UPI ఆప్షన్ ఎంచుకుంటారు. వారి UPI పిన్ ద్వారా అభ్యర్థనను నిర్ధారిస్తారు.
వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే, డబ్బు నేరుగా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియ కోసం ఎలాంటి చెక్, ఫారమ్ లేదా ఆఫ్‌లైన్ డాక్యుమెంట్‌లు అవసరం లేదు. పీఎఫ్ ఖాతాదారుడి రిక్వెస్ట్ అప్రూవ్ అయిన తర్వాత, కొంత సమయంలోనే ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
చివరి దశకు యూపీఐ విత్ డ్రా విధానం
ఈ మార్పు కోసం EPFO తన సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌ను UPI ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల లావాదేవీలు వేగంగా, సురక్షితంగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతాయి. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ మొత్తం ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి ముందు అన్ని సాంకేతిక లోపాలను అరికట్టవచ్చు. డేటా ప్రైవసీ, మోసాలను నియంత్రించడం, రియల్ టైమ్ అప్‌డేట్‌ల వంటి అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ సౌకర్యం ప్రారంభమైన తర్వాత PFకి సంబంధించిన ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
త్వరలో అధికారిక సమాచారం
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సౌకర్యంపై త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. సంబంధిత మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందిన తర్వాత దీనికి తుది రూపునిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, ప్రతి ఖాతాదారుడు దీన్ని సులభంగా ఉపయోగించుకునేలా దశల వారీగా మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఈ మార్పు ముఖ్యంగా డబ్బు అవసరమైన ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పుడు వారు అత్యవసర సమయంలో పీఎఫ్ విత్‌డ్రా కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు.






















