అన్వేషించండి

PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?

PF Salary Limit: పిఎఫ్ జీతం పరిమితి గురించి డిస్కషన్ మొదలైనట్టు సమాచారం. పెంచే ఆలోచన కేంద్రం ఉందని తెలుస్తోంది. ఇది నేరుగా ఉద్యోగుల జీతంపై ప్రభావం చూపుతుంది.

PF Salary Limit: దేశంలో కోట్లాది మంది PF ఖాతాదారులు ఉన్నారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు ఒక పెద్ద శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన  చేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద జీతాల పరిమితిని పెంచడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 15000 వరకు ఉంది. ఇది సెప్టెంబర్ 2014లో నిర్ణయించారు. ఇప్పుడు ఈ లిమిట్ పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. రూ.25000 నుంచి రూ. 30000 వరకు పెంచితే ఎలా ఉంటుందనే డిస్కషన్ జరుగుతోంది. 

ప్రస్తుతం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ప్రజలపై విపరీతంగా ఉంటోంది. అన్ని ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఇలా పెరిగిపోతున్న వేళ ఉద్యోగులకు ఊరట కల్పించేందుకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగించే చర్యల దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అందుకే పీఎఫ్ పరిమితి పెంచాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. దీంతో పీఎఫ్ పరిధిలోకి వచ్చే చాలా మంది జీతాల్లో కొన్ని మార్పులు రావచ్చు. 

నివేదిక ప్రకారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, శాలరీ స్ట్రక్చర్‌లో వచ్చిన మార్పులు, సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేయొచ్చని తెలుస్తోంది. ఈ మార్పు అమలులోకి వస్తే, ఇది కోట్లాది మంది ఉద్యోగస్థుల పొదుపు, పెన్షన్ , చేతికి వచ్చే జీతంపై ప్రభావం ఉంటుంది.  

జీతాల పరిమితి పెరగడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?

ఒకవేళ PF జీతాల పరిమితి రూ. 25000 లేదా రూ. 30000కి పెరిగితే, రిటైర్మెంట్ పొదుపుపై అతిపెద్ద ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం రూ. 15000 కంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులకు, వారి PF పరిమిత మొత్తంలో లెక్కిస్తారు. కొత్త పరిమితి అమలులోకి వచ్చిన తర్వాత, ఎక్కువ బెసిక్‌ జీతం PFలో చేరుతుంది. దీనివల్ల ప్రతి నెలా జమ చేసే మొత్తం పెరుగుతుంది. దీని ప్రత్యక్ష ప్రభావం ఏమిటంటే, పదవీ విరమణ సమయంలో లభించే నగదు భారీగా ఉంటుంది. పెన్షన్ మొత్తం కూడా పెరగవచ్చు.

ఎందుకంటే PF ఆధారంగానే పింఛన్ లెక్కిస్తారు. దీనితో పాటు, PFపై వడ్డీ కూడా ఇస్తారు. దీన్ని  పన్ను నుంచి మినహాయిస్తారు. అందుకే పరిమితి పెంచితే మాత్రం దీర్ఘకాలికంగా మంచి పొదుపుగా మారే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఉద్యోగుల సామాజిక భద్రత బలపడుతుందని, భవిష్యత్తులో వారికి ఎక్కువ ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు, పదవీ విరమణ తర్వాత PF కాకుండా మరే ఇతర ఆప్షన్ లేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రయోజనమా లేదా నష్టమా?

జీతాల పరిమితి పెరగడం అంటే ఉద్యోగుల చేతికి వచ్చే జీతం తగ్గవచ్చు. ఎందుకంటే PFలో ఉద్యోగి,  కంపెనీ రెండు విభాగాల నుంచి కట్ అయ్యేది కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, మీ ప్రాథమిక జీతం రూ.30000 అయితే, 12 శాతం ప్రకారం ప్రతి నెలా కట్ అయ్యే మొత్తం ప్రస్తుతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చేతికి వచ్చే జీతం తగ్గుతుంది, ఇది చాలా మందికి వెంటనే ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా యువ ఉద్యోగులు, ఎవరికైతే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయో వారికి తాత్కాలికంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం దీని ప్రయోజనాలను చూస్తారు. 

వారికి ఈ మార్పు భారంగా అనిపించవచ్చు. కంపెనీలపై కూడా భారం పెరుగుతుంది. ఎందుకంటే వారు కూడా ఎక్కువ వాటా జమ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కొత్త నియామకాల తర్వాత శాలరీ స్ట్రక్చర్‌పై ప్రభావం పడుతుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటే, ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికను పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెరిగిన PF షేర్‌, చేతికి వచ్చే జీతం మధ్య సమతుల్యతను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget