వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
Team India Batter విరాట్ కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే కెరీర్ ప్రారంభంలో టీమిండియా ఓపెనర్ గా ఆడినా డకౌట్ లేకుండా జాగ్రత్త పడ్డాడు.

Virat Kohli | విరాట్ కోహ్లీ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగులు సాధిస్తూనే ఉంటాడు. అందుకే అతడ్ని రన్ మేషిన్ అని పిలుస్తారు. ముఖ్యంగా వన్డేల్లో అతడు మరింత ప్రమాదకర బ్యాటర్. సాధారణంగా వన్డే క్రికెట్‌లో టీమిండియాకు అత్యంత నమ్మదగిన నంబర్-3 బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ కొనసాగుతున్నాడు. అయితే, తన కెరీర్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లలో కోహ్లీ ఓపెనర్‌గా ఆడాడు. ఆ సమయంలో అతను ఏం నేర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అనుగుణంగా మారడానికి కోహ్లీ ప్రయత్నాలు చేశాడు.
వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం
2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌ను ప్రారంభించాడు. అదే సిరీస్‌లో అతను ఓపెనర్‌గా కూడా బ్యాటింగ్ చేశాడు. తన మొదటి మ్యాచ్‌లో కోహ్లీ 22 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ పెద్దది కాకపోయినా, ఇక్కడి నుంచే కింగ్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది.
ఓపెనర్‌గా మొదటి అర్ధ సెంచరీ
సిరీస్ లో విరాట్ కోహ్లీ త్వరగా తనను తాను మెరుగుపరుచుకున్నాడు. నాల్గవ వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఓపెనర్‌గా తన మొదటి, ఏకైక అర్ధ సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 54 పరుగులతో రాణించాడు. వన్డేలలో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేస్తూ కోహ్లీ అత్యుత్తమ స్కోరు.
ODIలలో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు
వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 7 మ్యాచ్‌లలో ఓపెనింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లన్నింటిలోనూ అతడు భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించి మొత్తం 166 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా అతని సగటు 23.71గా ఉండగా, స్ట్రైక్ రేట్ 65.09గా ఉంది. ఓపెనర్‌గా అతని పేరిట ఒక అర్ధ సెంచరీ ఉంది. అతను ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. కొత్త బ్యాటర్ అయినప్పటికీ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన సున్నా పరుగులకు వికెట్ చేజార్చుకోలేదు. ఈ 7 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ మొత్తం 22 ఫోర్లు కొట్టాడు.
కోహ్లీ బ్యాటింగ్ స్థానం ఎందుకు మార్చారు
ఓపెనర్‌గా పరిమిత అవకాశాలు లభించిన తర్వాత, టీమిండియా విరాట్ కోహ్లీకి నంబర్ 3 బాధ్యతను అప్పగించింది. ఈ నిర్ణయం అతని కెరీర్‌లో ఒక మలుపు. ఓపెనర్ గా కొన్ని మ్యాచ్‌లాడిన తరువాత మిడిల్ ఆర్డర్ ఆడి మరింత మెరుగయ్యాడు. కానీ కోహ్లీ పరుగుల దాహం అలాగే ఉంది. ఈ క్రమంలో గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించడం, ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు రావడంతో కీలకమైన మూడో స్థానంలో మంచి బ్యాటర్ కావాలని కోహ్లీకి అవకాశం ఇచ్చారు. కోహ్లీ నిలకడతో పాటు టెక్నిక్, మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్‌లతో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ 2-1తో భారత్ కోల్పోయినా.. ఈ సిరీస్ లో భారత్ నుంచి ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ కోహ్లీనే. మూడు వన్డేల్లో రెండు సెంచరీ సాధించి తనలో ఇంకా బ్యాటింగ్ సత్తా ఉందని మరోసారి నిరూపించాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో త్వరగా ఓపెనర్లు ఔటైనా మరో ఎండ్ లో నితీష్ కుమార్ రెడ్డి, తరువాత హర్షిత్ రానాల సాయంతో 54వ వన్డే శతకం చేసిన కోహ్లీ చివర్లో ఔటయ్యాడు. చేయాల్సిన రన్ రేట్ అధికంగా ఉండటం, మరోవైపు వికెట్లు లేకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కానీ కోహ్లీ మాత్రం తనదైన మార్క్ చూపించే ఇన్నింగ్స్ ఆడాడు.





















