Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Iind vs nz 3rd odi | ఇండోర్ వేదికగా జరగుతున్న వన్డేలో విరాట్ కోహ్లీ 54వ వన్డే శతకం సాధించాడు. న్యూజిలాండ్ పై సెంచరీతో కొత్త రికార్డు నెలకొల్పాడు కింగ్ కోహ్లీ.

Most Centuries vs New Zealand ODI: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 54వ సెంచరీని సాధించాడు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. రన్ మేషిన్ కోహ్లీ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.
విరాట్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు
విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్ అయ్యాడు. కివీస్ జట్టుపై ఇది అతని 7వ సెంచరీ. రికీ పాంటింగ్, వీరేందర్ సెహ్వాగ్ ODI ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై 6 సెంచరీలు చొప్పున సాధించారు. అయితే కింగ్ కోహ్లీ తాజా సెంచరీతో పాంటింగ్ , సెహ్వాగ్ లను అధిగమించి నెంబన్ వన్ అయ్యాడు.
- విరాట్ కోహ్లీ - 7 సెంచరీలు
- రికీ పాంటింగ్ - 6 సెంచరీలు
- వీరేందర్ సెహ్వాగ్ - 6 సెంచరీలు
338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 15.3 ఓవర్లలో 82/4 స్కోరుతో కష్టాల్లో పడింది.
టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఇండోర్ సైలెంట్
ఇండోర్ పిచ్ పరుగులు సాధించడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, స్కోరు బోర్డు ఒత్తిడిలో భారత టాప్ ఆర్డర్ తమ లయను అందుకోవడానికి కష్టపడింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 పరుగులకే అవుట్ కావడంతో ఛేజింగ్ సరిగ్గా ప్రారంభం కాలేదు, ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (23) కూడా త్వరగా అవుట్ అయ్యాడు. తన ఇటీవలి ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. శ్రేయాస్ అయ్యర్ (3), కెఎల్ రాహుల్ (1) వరుసగా అవుట్ కావడంతో పరిస్థితి మరింత దిగజారింది, మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారింది. కైల్ జేమీసన్, జేడెన్ లెన్నాక్స్ స్పిన్ బౌలింగ్‌తో న్యూజిలాండ్ బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డితో కలిసి భారత ఇన్నింగ్స్ ను కోహ్లీ చక్కదిద్దాడు. తరువాత హర్షిత్ రాణాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పినా విజయం దక్కలేదు.
అప్‌డేట్ కొనసాగుతోంది....




















