The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?
The Raja Saab : ప్రభాస్ 'ది రాజా సాబ్' మరో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Prabhas's The Raja Saab Second Trailer Will Release In Pre Release Event : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ మారుతి కాంబో అవెయిటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, వింటేజ్ ప్రభాస్ లుక్స్, సాంగ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్‌కు మూవీ టీం మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
సరికొత్తగా మరో ట్రైలర్
ఈ మూవీ నుంచి సరికొత్తగా మరో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2 నెలల క్రితమే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది. దాన్ని మించేలా మరో ట్రైలర్ రెడీ అవుతోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కొత్త ట్రైలర్ రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
డార్లింగ్ వస్తారా?
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారని... అమెరికాలో ఈవెంట్ జరుగుతుందనే రూమర్స్ వచ్చాయి. అయితే, అనూహ్యంగా హైదరాబాద్‌లోనే ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీం రెడీ అవుతోందట. ఈ నెల 27న హైదరాబాద్ LB స్టేడియంలో ఈవెంట్ భారీగా నిర్వహించేందుకు టీం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌తో పాటు మూవీ టీం, ఇతర సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.
చాలా రోజుల తర్వాత ప్రభాస్ బయట ఈవెంట్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ చేస్తుండగా ఆయన ప్రభాస్ లుక్ రివీల్ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారట. అందుకు తగినట్లుగానే 6 నెలలు ఎక్కువగా బయట కనిపించకూడదంటూ కండీషన్ పెట్టగా... దీనికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు టాక్ వినిపించింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన రానున్నట్లు సమాచారం. భారీగా వచ్చే ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలోనే మరో సాంగ్
ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ 'రెబల్ వైబ్' బ్యాచిలర్ లైఫ్‌కు కనెక్ట్ అయ్యేలా అదిరిపోగా... రెండో సాంగ్ 'సహనా సహనా' లవ్ రొమాంటిక్ మెలోడి. ఈ పాటలో ప్రభాస్, నిధి అగర్వాల్ డ్యాన్స్ అదరగొట్టారు. ఈ పాటలను మించేలా ముగ్గురు హీరోయిన్స్‌తో కలిపి ప్రభాస్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. వీటీవీ గణేష్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.





















