Bigg Boss Telugu Latest Promo : బిగ్బాస్ హోజ్లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
Bigg Boss 9 Telugu Finale : బిగ్బాస్ సీజన్ 9 తెలుగు ఫినాలే సందర్భంగా శివాజీ, లయ హోజ్లోకి వచ్చారు. సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని అనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఫన్ చేశారు.

BiggBoss Season 9 Telugu Shivaji, Laya Promo Highlights : బిగ్బాస్ సీజన్ 9 తెలుగు 104 లాస్ట్ శనివారం మొదటి ప్రోమో వచ్చేసింది. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అందించి.. కంటెస్టెంట్లకు బూస్ట్ ఇచ్చేందుకు ఇంట్లోకి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్ వచ్చేశారు. మరి వాళ్లు హోజ్లోకి వచ్చి చేసిన హంగామా ఏంటి? ప్రోమోలో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమో.. చిరునామా సాంగ్‌తో ప్రారంభమైంది. ఆ సాంగ్ వస్తుండగా.. ఇంట్లోపలికి లయ, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ హోజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. లయకి, రోహన్‌కి ఇమ్మూ వెల్కమ్ చెప్పగా.. సంజన, తనూజ కూడా వారితో మాట్లాడారు. సీక్రెట్ రూమ్‌నుంచి శివాజీ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. శివాజీతో ఇమ్మూ ఫన్ చేశాడు.
శివాజీ ఫన్..
బయటకి వచ్చిన శివాజీ.. పవన్‌ని చూసి.. పాపం అంటూ దగ్గరికి తీసుకుని బాధలో ఉన్నాడురా. అర్రెరే.. చిలకో చోట.. గోరింక ఓ చోట ఉంది అంటూ ఫన్ చేశాడు. శివాజీ గారికి ఆయన మెమోరీస్ గుర్తొస్తున్నాయనుకుంటా అంటూ లయ చెప్తోంది. సంజనని ఉద్దేశిస్తూ.. చేతులు దురద లేవా అంటే.. ఇమ్మూ అయిపోయాయి అన్నా అంటూ ఫన్ చేశాడు. రోహన్‌తో మన సామాన్లు జాగ్రత్త రోయ్ అన్నారు శివాజీ.
శివాజీ, లయ టాస్క్..
శివాజీ, లయ.. రీతూ, డిమోన్లను రీక్రియేట్ చేశారు. లయ వంట చేస్తుండగా.. ఏమైంది అలా ఉన్నావు అంటూ శివాజీ అడుగుతాడు. కాదురా ఏమైంది అంటూ అడగ్గా నేను కట్ చేస్తున్నాను కదా అని లయ అంటుంది. పోయి నువ్వు వేరే పని చేసుకో అంటే.. బాగుంది. పని చేస్తామన్నా కోపాలే ఇక్కడ. తర్వాత తీసుకెళ్లి యాపిల్ ఇచ్చి.. నువ్వు అర్థం చేసుకోవట్లేదు అసలా అంటూ బుజ్జగించడం అంతా చాలా ఫన్నీగా సాగింది.
ఈ టాస్క్‌తో అందరూ అరుచుకుంటూ ఫుల్ హ్యాపీ అయ్యారు. సేమ్ ఇలా చేస్తాడంటూ.. నవ్వేస్తుండగా.. పవన్ సిగ్గుపడ్డాడు. తర్వాత అందరూ కలిసి నీతోనే డ్యాన్స్ టూ నైట్ సాంగ్కి డ్యాన్స్ వేశారు. సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని సినిమా ప్రమోషన్స్లో భాగంగా లోపలికి శివాజీ వెళ్లినా.. ఈ 5 కంటెస్టెంట్లు వెళ్లేముందు హోస్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది శివాజీకే.






















