Bigg Boss Telugu Demon Pavan Promo : కామనర్ టూ టాప్ 5.. ఎదురులేని యోధుడివంటూ డిమోన్ పవన్‌ని పొగిడేసిన బిగ్‌బాస్
Bigg Boss 9 Telugu Today Promo : బిగ్‌బాస్ స్పెషల్ ఏవీలో చాలామంది ఎదురు చూస్తోన్న డిమోన్ పవన్ స్పెషల్ ఏవీ ఈరోజు టెలికాస్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా.

Bigg Boss 9 Telugu Demon Pavan AV Promo : బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన డిమోన్ పవన్ స్పెషల్ ప్రోమో ఈరోజు ఎపిసోడ్లో రానుంది. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. కామనర్‌గా వచ్చి.. టాప్ 5గా నిలిచిన తీరును.. బిగ్‌బాస్ మెచ్చుకున్నాడు. పవన్‌కి భారీ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడు బిగ్‌బాస్. ప్రోమోలో అదిరే సాంగ్స్ పెట్టి గట్టిగా ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ పవన్‌కి ఇచ్చిన హైప్ ఏంటో.. ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్ పవన్‌కి ఇచ్చిన ఎలివేషన్.. పవన్ కామనర్‌గా అడుగు పెట్టి.. మీరు ఈ బిగ్‌బాస్ రణరంగంలో కాంకరర్గా మారిన తీరు.. మీ ప్రత్యర్థుల వెన్నులో ఒణుకు పుట్టించింది. మీరు ఎవరి వైపు ఉంటే.. వారికి కొండంత బలం. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. మీకు ఏ గెలుపు సులువుగా లభించిలేదు. మీరు చెమటోడ్చి.. చివరి వరకు పోరాడి.. గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ.. టఫ్ఫెస్ట్ కాంపిటేటర్‌గా, తల్లి ఆశీస్సులతో.. ఎదురులేని యోధుడిగా ఇప్పుడు టాప్ 5లో నిలబడ్డారు అంటూ బిగ్‌బాస్ చెప్పగా.. లవ్ యూ బిగ్‌బాస్ అంటూ పవన్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. పూర్తి ఏవీ కోసం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
కామనర్ టూ టాప్ 5
కామనర్‌గా అగ్నీపరిక్షకు వచ్చిన డిమోన్ పవన్.. అక్కడ గెలిచి.. బిగ్‌బాస్ హోజ్లో కామనర్‌గా అడుగుపెట్టాడు. మొదటి నుంచి టాస్క్‌ల్లో తనదైన ప్రతిభను కనబరిచాడు. అంతేకాకుండా రీతూతో ఫ్రెండ్షిప్ కూడా అతనికి బాగా హైప్ తీసుకొచ్చింది. ఈ బిగ్‌బాస్ హోజ్లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీని ఎదుర్కొని టాప్ 5 వరకు వచ్చాడు. రీతూ ఎలిమినేట్ అవ్వనంత వరకు.. డిమోన్ పవన్ కామెడీ ప్రజలకు తెలియలేదు. ఈ మధ్యకాలంలో అతని కామెడీని చాలామంది మెచ్చుకుంటున్నారు. చివరి వరకు గేమ్స్ ఆడి గెలిచి.. బిగ్‌బాస్‌లో గేమ్స్ అంటే డిమోన్ పవన్ అనిపించేలా మార్క్ వేశాడు. టాప్ 5లో ఉన్న డిమోన్.. టాప్ 3లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.






















