అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
ఐపీఎల్ హిస్టలో వన్ ఆఫ్ ది టాప్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఈ సారి మినీ వేలంలో సీఎస్‌కే ఫ్యాన్స్‌కి ఊహించని షాకిచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌పై కోట్లు కుమ్మరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మల కోసం ఒక్కొక్కరికీ ఏకంగా 14.2 కోట్లు కుమ్మరించడం ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఆల్రెడీ టీమ్‌లో ధోనీ, శాంసన్ ఇద్దరు కీపర్లుండగా.. మరో అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ కోసం 14 కోట్లు చెల్లించడమే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే చెన్నై తీసుకున్న ఈ డెసిషన్ టీమ్‌ని ఫ్యూచర్ కోసం బిల్డ్ చేయడానికే అని కొంతమంది చెబుతున్నా.. ప్రస్తుతం టీమ్ పరిస్థితి చూస్తే మాత్రం పూర్తిగా యంగ్ ప్లేయర్స్‌తో నిండిపోయి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ తక్కువగా కనిపిస్తున్నారు. టీమ్ విషయానికొస్తే.. సంజు శాంసన్, రుతురాజ్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, శివమ్ దూబే కనిపిస్తున్నారు. అయితే చెన్నై బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కాస్త వీక్‌గా కనిపిస్తోంది. స్టార్ పేసర్ పతిరన వెళ్లిపోవడంతో పేస్ డిపార్ట్‌మెంట్‌ని లీడ్ చేసే పేసర్ కనిపించడం లేదు. స్పిన్‌లో కూడా రవీంద్ర జడేజా వెళ్లిపోవడంతో నూర్ అహ్మద్‌పైనే భారతమంతా పడే డేంజర్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ సీజన్లో చెన్నై గ్రూప్ స్టేజ్ దాటాలంటే టీమ్‌గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మేబీ.. చెన్నై ప్లాన్ కూడా అదే అయ్యుంటుంది.





















