అన్వేషించండి

Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 

Telangana Congress : MNGNREGAను VB G Ram Gగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ బీజేపీ ఆఫీస్‌లను ముట్టడించింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Telangana Congress : కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త ఉపాధి హామీ పథకం బిల్లుపై కాంగ్రెస్ భగ్గుమంది. పథకం పేరు నుంచి మహాత్మ గాంధీ పేరును తొలగించడంపై మండిపడుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీస్‌లను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. నేరుగా  కీలక కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. దీనికి కౌంటర్‌గా గాంధీభవన్‌ను బీజేపీ నేతలు ముట్టడించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. 

ఆదిలాబాద్‌ నుంచి ఇటు మహబూబ్‌నగర్, ఖమ్మం వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీస్‌లను కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీజీ పేరును చెరిపేయాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని నేతలు ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూడా నిరసనలు చేపట్టారు. పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు రక్షణగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నిలబడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్గొండలో తమ కార్యాలయం ముట్టడికి వచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులపై బీజేపీ శ్రేణులు దాడికి యత్నించడం పరిస్థితిని వేడెక్కించింది. అయితే పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు. ఇలాంటి ఘటనలు తెలంగాణలోని దాదాపు అన్నిజిల్లా కేంద్రాల్లో కనిపించాయి. 

హైదరాబాద్‌లో అయితే కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి వెళ్లేందుకు చూస్తే కొంత మంది బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్‌ ముట్టడికి యత్నించారు. గాంధీభవన్‌ నుంచి నేరుగా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ట్రై చేశాయి. దీన్ని గ్రహించిన బీజేపీ శ్రేణులు ముందే అక్కడకు చేరుకున్నాయి. అటు వాళ్లు ఇరు రాకుండా ఇటు ఉన్న బీజేపీ వాళ్లు అటు వెళ్లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గాంధీభవన్ గేట్లను మూసివేశారు. అక్కడి నుంచి అందర్నీ తరలించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  ట్రాఫిక్ జామ్ అయ్యింది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Embed widget