T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంకలో జరుగుతుంది. దీని కోసం జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) ఆడేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఈ ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును కాసేపట్లో ప్రకటించనున్నారు. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ కోల్పోవడం టీమ్ ఇండియా ఆందోళనను పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని జట్టులోకి తీసుకోవాలి, ఎవరిని తప్పించాలి అనే దానిపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ కప్‌లో భారత జట్టు ఎలా ఉండబోతోంది?
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ కప్‌లో ఆడతాడా?
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, అండర్-19 ఆసియా కప్లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శన ఆధారంగా అతన్ని ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. వైభవ్‌ను ప్రపంచ కప్‌లో చూస్తామా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, లేదు. ఎందుకంటే ICC నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి ఒక ఆటగాడి వయస్సు కనీసం 15 సంవత్సరాలు ఉండాలి.
రిషబ్ పంత్ అవుట్! సూర్యకుమార్ కెప్టెన్
రిషబ్ పంత్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడటం కష్టమే, ఎందుకంటే జట్టులో ఇప్పటికే జితేష్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఇద్దరు వికెట్ కీపర్-బ్యాటర్లు ప్రత్యామ్నాయంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఫామ్‌లో లేనప్పటికీ, కనీసం టీ20 ప్రపంచ కప్ 2026 వరకు కెప్టెన్‌గా కొనసాగవచ్చు. మరోవైపు, ఫామ్ కోల్పోయినప్పటికీ శుభ్‌మన్ గిల్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది.
హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ స్థానాలు కూడా ఖాయమనిపిస్తోంది. యశస్వి జైస్వాల్, రింకు సింగ్ మంచి టీ20 గణాంకాలు కలిగి ఉన్నప్పటికీ జట్టులో స్థానం పొందే అవకాశాలు తక్కువ. అయితే, వారిని రిజర్వ్ ఆటగాళ్లుగా తీసుకునే అవకాశం ఉంది.
Anticipation is soaring as the @ICC Men’s #T20WorldCup approaches! It is set to be the most global, most accessible, and most competitive edition ever. The action begins on February 7. pic.twitter.com/RM4KxNJSmx
— Jay Shah (@JayShah) December 19, 2025
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యష్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్




















