Hardik Pandya in India vs South Africa T20 | రికార్డులు బద్దలు కొట్టిన హార్దిక్
చాలా గ్యాప్ తర్వాత టీమ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్య.. తన కమ్బ్యాక్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. క్రీజులోకి రావడంతో బౌండరీతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యా.. వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. తన బ్యాటింగ్ తో సఫారీల బౌలర్లకు కొద్దిసేపు చుక్కలు చూపించాడు. కేవలం 8 బంతుల్లోనే 30 పరుగులు చేసిన కుంగ్‌ఫూ పాండ్యా, 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పాడు.
హాఫ్ సెంచరీ చేసిన తర్వాత స్టాండ్స్‌లో నుంచి మ్యాచ్‌ని చూస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మకి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. మహీకా కూడా అక్కడ నుంచే ముద్దుల మీద ముద్దులు ఇచ్చింది. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సత్తా చాటాడు. కీలకమైన డివాల్డ్ బ్రెవిస్ వికెట్ ను పడగొట్టాడు. ఈ సిరీస్ లో హార్దిక్ పాండ్య అద్భుతంగా రాణించాడు. ముందు జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఇది కేవలం టీజర్ మాత్రమేనని ఫ్యాన్స్ అంటున్నారు.





















